SBI PO Result 2021: ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ 2021 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

SBI PO Result 2021 For Prelims Declared: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబెషనరీ ఆఫీసర్ 2021 ఫలితాలు వచ్చేశాయ్. ఫలితాలను ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 19, 2021, 01:32 PM IST
  • దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ 2021 ఫలితాలు విడుదల చేసిన అధికారులు
  • అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఎస్‌బీఐ పీఓ 2021 ఫలితాలు
SBI PO Result 2021: ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ 2021 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

SBI PO Result 2021 For Prelims Declared: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ప్రొబెషనరీ ఆఫీసర్ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్. స్టేట్ బ్యాంక్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు(SBI PO Prelims Result 2021)ను పొందుపరిచింది. ఎస్బీఐ పీఓ మెయిన్స్ పరీక్షను జనవరి 29, 2021న నిర్వహించనున్నారు.

ఎస్‌బీఐ పీఓ రిజల్ట్ 2021 డైరెక్టక్ లింక్  

Click Here To Check SBI PO Result 2021
 

పరీక్ష రాసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి SBI ఫలితాలు చూసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. ఈ జనవరి 4, 5, 6 తేదీల్లో ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించగా సోమవారం నాడు ఫలితాలు విడుదల చేశారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు మెయిన్స్ పరీక్షకు హాజరు అవుతారు.

Also Read: ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ

ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఫలితం ఫిబ్రవరి 2021లో విడుదల చేయనున్నారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి చివరి ప్రక్రియ పీఓ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫిబ్రవరి / మార్చి 2021 సమయంలో నిర్వహించనున్నారు. ఎస్బీఐ పీఓ తుది ఫలితం మార్చి 2021 చివరి వారంలోగా రానుంది. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగాలలో చేరాల్సి ఉంటుంది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News