SBI Pension Seva:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక పెన్షన్ సేవల్ని ప్రవేశపెట్టింది. కొత్త పెన్షన్ సేవల కోసం ఓ పోర్టల్ కూడా అందుబాటులో తెచ్చింది.
ఎస్బీఐ సరికొత్త పెన్షన్ సేవల్ని(SBI Pension Seva)ప్రారంభించింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ ఖాతాదార్ల కోసం ఈ పెన్షన్ సేవల్ని అందుబాటులో తెచ్చింది. ఈ సేవల కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ https://www.pensionseva.sbi పోర్టల్ ప్రవేశపెట్టింది. ఈ పోర్టల్ ద్వారా సీనియర్ సిటిజన్లైన ఖాతాదారులు అన్ని రకాల పెన్షన్ సర్వీసుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా అవసరమైన సమాచారం నింపి..పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తరువాత పెన్షన్ సేవల్ని సులభంగా పొందవచ్చని ఎస్బీఐ(SBI) వివరించింది.
ఎస్బీఐ ప్రవేశపెట్టిన ఈ పోర్టల్( New Portal)ద్వారా బకాయిలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షన్ స్లిప్ లేదా ఫారం 16ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షన్ లాభం వివరాల్ని తెలుసుకోవచ్చు. పెట్టుబడుల్ని తనిఖీ చేసుకుని..లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు పెన్షన్ చెల్లింపు వివరాలకు సంబంధించిన అలర్ట్ వస్తుంది. అదే విధంగా లైఫ్ సర్టిఫికేట్ సదుపాయాన్ని దగ్గరలో ఉన్న ఎస్బీఐ కార్యాలయంలో తీసుకోవచ్చు. ఇక రిజిస్టర్ మెయిల్‌కు పెన్షన్ స్లిప్ కూడా వస్తుంది. పోర్టల్‌లో రిజిస్టర్ చేసిన తరువాత ఏదైనా సమస్య తలెత్తితే స్క్రీన్ షాట్ తీసి support.pensionseva@sbi.co.inకు మెయిల్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఎస్ఎమ్ఎస్ అన్‌హ్యాపీ అని టైప్ చేసి 8008202020కు పంపించవచ్చు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 18004253800కు కాల్ చేయవచ్చు.
Also read: EPFO : ఈపీఎఫ్ యూఏఎన్‌తో ఆధార్ నెంబర్ అనుసంధానానికి గడువు తేదీ పొడిగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook