Tamilnadu politics: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జైలు నుంచి విడుదలైన శశికళ..ఏఐఏడీఎంకే పార్టీపై కన్నేశారు. పోగొట్టుకున్న పదవిని తిరిగి దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. కోర్టును ఆశ్రయించారు.
తమిళనాడు ( Tamilnadu )లో మరో 2-3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ( Assembly Elections ) జరగనున్నాయి. అవినీతి, అక్రమాస్థుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదలైన చిన్నమ్మ అలియాస్ శశికళ ( Sasikala ) తమిళ రాజకీయాల్లో కలవరం రేపుతున్నారు. జైలుకు వెళ్లేముందు తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఏకమై..ఆమెను పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పించారు. జైలు నుంచి విడుదలయ్యాక సొంత పార్టీ పెట్టుకుంటారనే అంతా భావించారు. అందుకు భిన్నంగా ఏఐఏడీఎంకే పార్టీ జెండాతో ర్యాలీ నిర్వహించి పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఎలాగైనా పార్టీపై పట్టు కోసం వ్యూహం రచిస్తున్నారు. పోగొట్టుకున్న పార్టీ పదవిని తిరిగి దక్కించుకునేందుకు కోర్టును ఆశ్రయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ( Tamilnadu cm palaniswamy ), ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
జయలలిత ( Jayalalitha )మరణం తరువాత ఆమె నెచ్చెలిగా పార్టీ జనరల్ సెక్రటరీ పదవి చేపట్టారు శశికళ. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేలోగా జైలుకు వెళ్లడంతో పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం ( Panneer selvam ) వర్గాలు ఏకమై..ఆమెను పార్టీ నుంచే బహిష్కరించేశారు. 2017లో పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తనను తప్పించడంపై ఇప్పుడామె కోర్టు మెట్టెక్కారు. తనకు జరిగిన నష్టానికి పరిహారంతోపాటు పిటీషన్ వెంటనే వినాలని కోర్టు ( High court )ను అభ్యర్ధించారు. మార్చ్ 15న ఈ పిటీషన్ విచారణకు రానుంది. కొత్త పార్టీ పెట్టే కంటే ఏఐఏడీఎంకే పార్టీనే కైవసం చేసుకుంటే మంచిదని ఆమె ఆలోచిస్తున్నారు. బెంగళూరు నుంచి చెన్నైకు భారీ ర్యాలీతో వచ్చినప్పుడు కూడా అన్నాడీఎంకే కార్యకర్తలు, నేెతలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆమె వెంట ఉన్నారు. ఇదే అదనుగా పార్టీ పగ్గాల్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఈ పరిణాం జరగడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Also read: BJPలో చేరనున్న మెట్రో మ్యాన్ Sreedharan, ఎన్నికలకు సైతం రెడీ అంటున్న ప్రముఖుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook