సల్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న బీయింగ్ హ్యూమన్ స్వచ్ఛంద సంస్థ చిక్కుల్లో పడింది. బృహత్ ముంబై మునిసిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) తాజాగా బీయింగ్ హ్యూమన్ స్వచ్ఛంద సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నట్టు ప్రకటించింది. బాంద్రాలో కన్సెషనల్ డయాలసిస్ యూనిట్స్ నెలకొల్పేందుకు బీఎంసీ నుంచి టెండర్లు పొందిన బీయింగ్ హ్యూమన్ స్వచ్ఛంద సంస్థ.. ఏడాది దాటుతున్నప్పటికీ డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడాన్ని బీఎంసీ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే బీఎంసీ ఆ సంస్థతో జరిగిన పాత ఒప్పందాన్ని రద్దు చేస్తూ మళ్లీ కొత్త టెండర్లను ఆహ్వానించింది. బీయింగ్ హ్యూమన్ స్వచ్ఛంద సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడమే కాకుండా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడానికి గల కారణాలు తెలపాల్సిందిగా ఆదేశిస్తూ ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు సైతం జారీచేసింది.
CLICK HERE FOR MORE LIVE UPDATES FROM INDIA VS SOUTH AFRICA, 6Th ODI MATCH
ముంబై మిర్రర్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. పీపీపీ పద్ధతిలో ( పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ ) 12 కేంద్రాలు నెలకొల్పి అందులో 199 డయాలసిస్ మెషిన్లు ఏర్పాటు చేసేందుకు 2016 డిసెంబర్‌లో టెండర్లు ఆహ్వానించింది. ఈ డయాలసిస్ కేంద్రాల ద్వారా ప్రతీ నెల 10,000 డయాలసిస్ ప్రకియలు చేయడాన్ని బీఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ టెండర్ సొంతం చేసుకున్న బీయింగ్ హ్యూమన్ మాత్రం ఆ ప్రయత్నంలో విఫలమైందని తెలుస్తోంది. ఈ కారణంగానే తాజాగా బీఎంసీ ఈ చర్యకు పాల్పడిందని సమాచారం.
బీఎంసీ బ్లాక్‌లిస్టులో 'బీయింగ్ హ్యూమన్'!