బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలై బయటికొచ్చాడు. గత రెండు రోజులుగా జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో వున్న సల్మాన్ ఖాన్‌కి జోధ్‌పూర్ కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 1988 అక్టోబర్‌లో జోధ్‌పూర్‌కి సమీపంలోని కంకని గ్రామ శివార్లలో కృష్ణ జింకలు వేటాడి చంపిన కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్‌కి జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించడంతో మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రమే రాజస్థాన్ పోలీసులు అతడిని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. అదే రోజు సల్మాన్ ఖాన్ తరపు న్యాయవాదులు అతడికి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. కోర్టు ఆ బెయిల్ పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారం సైతం ఈ బెయిల్ పిటిషన్ విచారణ శనివారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా ఏదైనా కారణాల వల్ల సల్మాన్‌కి బెయిల్ మంజూరు రాకపోయినట్టయితే, మళ్లీ సోమవారం వరకు సల్మాన్ జైలులోనే గడపక తప్పదనే అభిప్రాయాలు వినిపించాయి. దీంతో శనివారం సల్మాన్ ఖాన్‌కి బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ మధ్య మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.
కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బెయిల్ పత్రాలను పరిశీలించిన జోధ్‌పూర్ సెంట్రల్ జైలు అధికారులు సల్మాన్‌ని బెయిల్‌పై విడిచిపెట్టారు. సల్మాన్ ఖాన్ విడుదలతో ముంబైలో అతడి నివాసం వద్ద సల్మాన్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.