కరోనా వైరస్ చికిత్సలో భాగంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ( Mumbai Municipal Corporation ) కీలక చర్యలు చేపట్టింది. బీఎంసీ ( BMC ) ఏర్పాటు చేసిన ప్లాస్మా థెరపీ యూనిట్ ను ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రారంభించారు. ప్లాస్మాను దానం చేసి...ప్రాణాల్ని కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు.
కోవిడ్ 19 వైరస్ కు ప్లాస్మా థెరపీ ( Plasma therapy ) ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది. కరోనా వైరస్ కు ఇంకా సరైన మందు లేకపోవడంతో యాంటీ వైరల్ డ్రగ్ అయిన రెమిడెసివిర్ ( Remdesivir ) లేదా ప్లాస్మా థెరపీతో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఇటీవల ఢిల్లీలో ప్లాస్మా బ్యాంకు ( Plasma Bank ) కూడా ఇండియాలో తొలిసారిగా ప్రారంభమైంది. ఇప్పుడిక ముంబైలో ప్లాస్మా థెరపీ యూనిట్ ( Plasma Therapy Unit ) ను ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) ప్రారంభించారు. ముంబైలోని సబ్ అర్బన్ అంధేరీలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఈ యూనిట్ ను అందుబాటులో ఉంచారు. ప్లాస్మా థెరపీ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం...ప్లాస్మాను దానం చేయాలంటూ సచిన్ టెండూల్కర్ విజ్ఞప్తి చేశారు. ప్లాస్మాను దానం చేయడం ద్వారా ప్రాణాల్ని కాపాడవచ్చని సూచించారు. కరోనా వైరస్ కట్టడిలో ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడుతున్న వైద్యులు, నర్శులు, పోలీసుల అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ప్రాణాల్ని సైతం పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు కరోనా వైరస్ ( Corona virus ) కు వ్యాక్సిన్ కనుగొనేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్నారని..ఈ పరిస్థితుల్లో కరోనాకు చికిత్సలో ప్లాస్మా థెరపీ ఓ ప్రత్యామ్నాయమని సచిన్ తెలిపారు. ప్లాస్మా థెరపీ యూనిట్ ఏర్పాటు చేసినందుకు బీఎంసీకు ధన్యవాదాలు తెలిపారు సచిన్ ( Sachin ) . Also read: Plasma bank: ప్లాస్మా బ్యాంకు ఎలా ఉంటుంది ? ఎవరు అర్హులు ?
కరోనా బారిన పడి కోలుకున్నవారిలో పెద్ద సంఖ్యలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఇవి కరోనా సోకిన వ్యక్తి చికిత్సలో సహయపడతాయి. అందుకే ఇప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాలు ప్లాస్మా థెరపీను ఆశ్రయిస్తున్నాయి. మహారాష్ట్ర ( Maharashtra ) లో కరోనా సోకిన వారి సంఖ్య ఇప్పటికే 2 లక్షలు దాటేసింది.