Viral Video: బస్సులు రోడ్లపై వెళుతుంటాయి.. విమానం ఆకాశంలో ప్రయాణిస్తుంది.. రైలు పట్టాలపై రైళ్లు రయ్ మని దూసూకెళ్తుంటాయి.. ఇది సాధారణంగా జరిగేది. కాని కర్ణాటకలో బస్సులన్నీ రైలెక్కాయి. బెంగళూరులోని ఓ రైల్వే స్టేషన్ పట్టాలపై ఉన్న రైలులో ఆర్టీసీ బస్సులను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. రోడ్డుపై ఉండాల్సిన ఆర్టీసీ బస్సులు.. రైలుపై ఉండటం ఏంటని షాకయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి,
సాధారణంగా బైకులు, ట్రాక్టర్లు వంటి వాహనాలను గూడ్స్ రైళ్లలో తరలిస్తుంటారు. కాని కర్ణాటకలో ఆర్టీసీ బస్సులను గూడ్స్ రైలులో ట్రాన్స్ పోర్ట్ చేశారు అధికారులు. ఇందుకు సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గూడ్స్ రైలుపై ఓకేసారి పదుల సంఖ్యలో బస్సులను అక్కడి అధికారులు తరలించారు. హోసూరు అశోక్ లేలాండ్ ప్లాంట్ లో హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకు చెందిన బస్సులు తయారయ్యాయి. వీటిని రోడ్డు మార్గంలో ట్రాన్స్ పోర్ట్ చేయాలంటే ఖర్చు భారీగా అవుతుంది. సమయం అధికంగానే ఉంటుంది. అందుకే హిమాచల్ ప్రదేశ్ అధికారులు బస్సులను తీసుకెళ్లడానికి ఇల్ ప్లాన్ చేశారు.
ప్రస్తుతం దేశంలో చమురు ధరలు భారీగా ఉన్నాయి. బస్సులను హోసూర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ తరలించాలంటే ఖర్చు తడిసి మోపడువుతుంది. అందుకే తక్కువ ఖర్చుతో తరలించే అవకాశం ఉండటంతో ఇలా రైలు మార్గం ద్వారా రవాణా చేశామని హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
READ ALSO:KCR DELHI TOUR: కేసీఆర్ చెప్పే సంచలనం ఇదేనా? బీజేపీకి గండమేనా?
READ ALSO: Omicron: దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్స్... తమిళనాడులో బీఏ.4, తెలంగాణలో బీఏ.5 వేరియంట్ గుర్తింపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Viral Video: రైలెక్కిన ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులు షాక్! వైరల్ వీడియో..
రైలెక్కిన ఆర్టీసీ బస్సులు
బెంగళూరు రైల్వే స్టేషన్ లో సీన్
ఆర్టీసీ బస్సులు గూడ్స్ రైలులో రవాణా