RRB Group D Updates: ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ అభ్యర్థులకు అలర్ట్.. అప్లికేషన్ స్టేటస్ లింక్ యాక్టివేట్ అయింది...

RRB Group D Updates: గ్రూప్ డీ అభ్యర్థులకు అలర్ట్.. ఆర్ఆర్‌బీ సైట్స్‌లో గ్రూప్ డీ అప్లికేషన్ స్టేటస్ లింక్ యాక్టివేట్ చేయబడింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..  

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 19, 2022, 01:29 PM IST
  • ఆర్ఆర్‌బీ లేటెస్ట్ అప్‌డేట్స్
  • గ్రూప్ డీ అభ్యర్థులకు అలర్ట్
  • గ్రూప్ డీ అప్లికేషన్ స్టేటస్ లింక్ యాక్టివేట్ చేయబడింది
 RRB Group D Updates: ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ అభ్యర్థులకు అలర్ట్.. అప్లికేషన్ స్టేటస్ లింక్ యాక్టివేట్ అయింది...

RRB Group D Updates: ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డీ పరీక్షకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ లింకు అందుబాటులోకి వచ్చింది. గురువారమే (ఆగస్టు 18) ఈ లింకు యాక్టివేట్ చేయబడింది. గ్రూప్ డీ అభ్యర్థులు ఈ లింకు ద్వారా తమ ఎలిజిబిలిటీ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. పుట్టిన తేదీ,రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా అభ్యర్థులు ఎలిజిబిలిటీ స్టేటస్‌ను చెక్ చేసుకునే అవకాశం ఉంది.

అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి :

అభ్యర్థులు సంబంధిత రీజినల్ ఆర్‌ఆర్‌బీ సైట్‌ను ఓపెన్ చేయాలి.
హోం పేజీలో CEN No.RRC-01/2019 లెవల్-1 లింక్‌పై క్లిక్ చేయాలి.
స్క్రీన్‌పై కనిపించే బాక్స్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి సబ్‌మిట్ ఆప్షన్ నొక్కాలి.
అంతే.. స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి.
ఆ కాపీని ప్రింటవుట్ తీసి ఉంచుకోవాలి.

ఆర్‌ఆర్‌బీ గ్రూప్ 'డీ' ఫేజ్-1 పరీక్ష ఆగస్టు 17న ప్రారంభమైంది. ఆగస్టు 25 వరకు మల్టీపుల్ షిఫ్ట్స్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఫేజ్-2 పరీక్ష ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనుంది. రైల్వే శాఖలో 1,03,769 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి దాదాపుగా 1.15 కోట్ల మంది అభ్యర్థులు గ్రూప్ డీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

Also Read: TRS Warning: బండి సంజయ్ నాలుక చీరేస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంచలనం

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్.. ఒకేసారి 3 బెనిఫిట్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News