Rohini Acharya Donate Kidney To Lalu Prasad Yadav: సింగపూర్ ఆసుపత్రిలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. లాలూకు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేశారు. ఆపరేషన్ కు ముందు తన తండ్రితో కలిసి దిగిన ఫొటోలను రోహిణి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె చేసిన మంచి పనికి కూతుళ్లపై గౌరవం మరింత పెరిగిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి కూతురి తండ్రి ఈరోజు గర్వపడుతున్నారంటూ చెబుతున్నారు. ఆపరేషన్ అనంతరం రోహిణిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వైరల్ చేస్తున్నారు.
Ready to rock and roll ✌️
Wish me a good luck 🤞 pic.twitter.com/R5AOmFMW0E— Rohini Acharya (@RohiniAcharya2) December 5, 2022
లాలూ ప్రసాద్ యాదవ్ రెండవ కుమార్తె రోహిణి ఆచార్య. సోమవారం సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో తన తండ్రికి కిడ్నీ దానం చేశారు. ఆచార్య తన తండ్రితో శస్త్రచికిత్సకు ముందు ఫొటోను పంచుకుంటూ.. "రాక్ అండ్ రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. విష్ మి లక్" అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
बेटियां यू हीं नहीं पापा की परी कही जाती हैं। ईश्वर खुद नहीं आ सकते, इसलिए परी के रूप में बेटी को भेजते हैं। #RohiniAcharya ने पिता #लालूयादव को जीवनदान देकर इसका (ईश्वर के स्वरूप) उदाहरण पेश किया है।
गर्व है आप पर। pic.twitter.com/dgPnazjjB0— Vikash Kumar Maurya (@vikashmaurya_3) December 5, 2022
రోహిణి, లాలూ యాదవ్‌ల ఫొటోలను షేర్ చేస్తూ.. భోజ్‌పురి గాయకుడు, నటుడు ఖేసరీ లాల్ యాదవ్ అభినందించాడు. 'సోదరి రోహిణి, మీరు చేసిన పనికి ప్రతి తండ్రి ఈ రోజు గర్వపడాలి. కూతురు పుట్టడం అదృష్టం. ఈరోజు మళ్లీ ప్రపంచమంతా ఈ సత్యానికి సాక్షిగా మారింది. గౌరవనీయులైన లాలూ యాదవ్ జీ, సోదరి రోహిణి జీ త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను..' అని ఆయన పోస్ట్ చేశాడు.
లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల సింగపూర్‌కు వెళ్లగా అక్కడ వైద్యులు కిడ్నీ మార్పిడి చేయించాలని సూచించారు. దీంతో తన తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు కుమార్తె రోహిణి ఆచార్య ముందుకువచ్చారు. లాలూ యాదవ్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సోమవారం జరిగింది. ఆపరేషన్ సమయంలో సింగపూర్‌లో రబ్రీ దేవి, మిసా భారతి, తేజస్వి యాదవ్, రోహిణి ఆచార్య సహా పలువురు కుటుంబ సభ్యులు ఉన్నారు. పశుదాన కేసుల్లో ప్రమేయంతో జైలుకెళ్లిన లాలూ యాదవ్.. చికిత్స కోసం ఢిల్లీ, రాంచీల్లో పలుమార్లు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.
Also Read: Pension Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. పెన్షన్ నిబంధనల్లో కీలక మార్పులు
Also Read: Ys Sharmila: థ్యాంక్యూ మోదీ జీ.. ప్రధాని ఫోన్ కాల్‌పై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook