కరోనా ఎఫెక్ట్ భారత స్టాక్ మార్కెట్లపైనా పడింది. సోమవారం ఉదయం ప్రారంభమైన మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. అదే విధంగా కరోనా దెబ్బకు క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గాయి. దీని ప్రభావం కూడా స్టాక్ మార్కెట్లపై పడింది.
కరోనా వైరస్ దెబ్బకు భారత స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. ఇవాళ ఆశాజనకంగా మార్కెట్లు ఓపెన్ అవుతాయని ఎదురు చూసిన మదుపరులకు నిరాశే మిగిలింది. మొత్తంగా కనీసం ఉదయం 11 గంటలు దాటక ముందే బాంబే స్టాక్ ఎక్చేంజీ BSE. . ఏకంగా 15 వందల పాయింట్లు కోల్పోయింది. అదే బాటలో జాతీయ స్టాక్ ఎక్చేంజీ.. NIFTY 280 పాయింట్లు కోల్పోయింది. దాదాపు 188 ఈక్విటీలపై ప్రభావం పడింది. మరోవైపు అంతర్జాతీయంగా కరోనా వైరస్ ఎఫెక్ట్ క్రూడ్ ఆయిల్ పైనా పడింది. దీంతో భారత చమురు కంపెనీలకు నష్టం వాటిల్లింది. అందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్..IOC భారీ నష్టాలను మూటగట్టుకుంది. బ్యాంకింగ్ రంగంలో యెస్ బ్యాంక్ షేర్లు దాదాపు 30 శాతం నష్టాలను చవి చూశాయి.
Read Also: 'కరోనా'.. నువ్ నన్ను ఏం చేయలేవ్..!!
మరోవైపు రూపాయితో డాలరు మారకం విలువ 25 పైసలు పడిపోయింది. దీంతో రూపాయతో డాలరు మారకం విలువ ఏకంగా 74 రూపాయల 03 పైసలకు చేరింది. శుక్రవారం రోజున రూపాయితో డాలరు మారకం విలువ 73 రూపాయల 78 పైసలుగా ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..