ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ, కాంగ్రెస్ మిశ్రమ స్పందన

ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఐతే ఆమ్ ఆద్మీ పార్టీ జోరుగా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దీంతో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి విజయం తథ్యమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Last Updated : Feb 11, 2020, 02:08 PM IST
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ, కాంగ్రెస్ మిశ్రమ స్పందన

ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఐతే ఆమ్ ఆద్మీ పార్టీ జోరుగా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దీంతో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి విజయం తథ్యమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కటిగా వెలువడుతున్న ఫలితాలు .. ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని ఖరారు చేస్తున్నాయి. మరోవైపు దేశంలో ప్రధాన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ .. రెండూ ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించాయి. అంతే కాదు మరోసారి ఢిల్లీ పీఠాన్ని అధిష్టంచనున్న ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలిపారు. ఐతే తమ ఓటమిని అంగీకరిస్తూనే .. మిశ్రమంగా స్పందించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ..  ప్రజా తీర్పును గౌరవిస్తామన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడుతుందని చెప్పారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐతే ఈ ఎన్నికలు ఢిల్లీ అభివృద్ధిపై జరగలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఢిల్లీ అభివృద్ధి, విద్య అంశాలపై ఎన్నికలు జరిగి ఉంటే .. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా వెనుకంజలో ఉండడానికి కారణమేంటని ప్రశ్నించారు. 

మరోవైపు.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరి .. చాందినీ చౌక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఆల్కా లాంబా కూడా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై భిన్నంగా స్పందించారు. ఈ ఎన్నికల్లో హిందూ, ముస్లిం ఓట్లు చీలిపోయాయన్నారు. హిందూ ఓట్లు బీజేపీ తన ఖాతాలో వేసుకుందని .. ముస్లిం ఓట్లన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి పడ్డాయని .. దీంతో కాంగ్రెస్ నష్టపోయిందని కొత్త థియరీ చెప్పారు. ఐతే ఎన్నికల ఫలితాన్ని స్వాగతించిన ఆమె.. ఓటమిపాలైనప్పటికీ ప్రజా సమస్యల నుంచి వెనుకడుగు వేసేది లేదని తెలిపారు. ఇవాళ పని చేస్తే .. రేపు గెలుస్తామంటూ ట్వీట్ చేశారు. 

Trending News