రావణుడు నోయిడాలో పుట్టాడు.. లంకలో కాదు: సుబ్రమణియన్ స్వామి

బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి మళ్లీ ఓ సరికొత్త వివాదానికి తెరదీశారు. ఈ సారి ఆయన కరుణానిధిని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Sep 23, 2018, 08:18 PM IST
రావణుడు నోయిడాలో పుట్టాడు.. లంకలో కాదు: సుబ్రమణియన్ స్వామి

బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి మళ్లీ ఓ సరికొత్త వివాదానికి తెరదీశారు. ఈ సారి ఆయన కరుణానిధిని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. రావణుడిని అందరూ ద్రావిడుడు అనుకుంటారని.. కానీ ఆయన లంకలో పుట్టలేదని... అందుకే ఆయన ద్రావిడుడు కాదని.. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పుట్టాడని ఆయన తెలిపారు. దక్షిణ గోవాలో జరిగిన ఓ సమావేశంలో "ఇండియన్ కల్చర్ హెరిటేజ్" అనే అంశంపై మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నోయిడాకి దగ్గరలో ఉన్న బిస్రక్ అనే పల్లెలో రావణుడు జన్మించాడని.. కానీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అనుకున్నట్లు రావణుడు ద్రావిడుడు కాదని ఆయన తెలిపారు.

చాలా మంది ద్రావిడులు రాముడిని విమర్శిస్తారని.. ఆయన ద్రావిడుడైన రావణుడిని చంపారని అనుకోవడం వల్లే ఈ సమస్య అని సుబ్రమణియన్ స్వామి తెలిపారు. కానీ రావణుడు ద్రావిడుడే కాదు కాబట్టి.. వారు అలా అనుకోవాల్సిన అవసరం లేదని స్వామి హితవు పలికారు. శివుడి వరాలు పొందాకే రావణుడు తొలిసారిగా లంకలోకి అడుగుపెట్టి కుబేరుడిని ఓడించి లంకను స్వాధీనం చేసుకున్నాడని.. ఈ ఘటన జరిగేంత వరకూ రావణుడికి లంకతో సంబంధం లేదని స్వామి అభిప్రాయపడ్డారు. 

అలాగే రావణుడు బ్రాహ్మణుడని.. సామవేదంలో పండితుడని.. కానీ కరుణానిధి రావణుడిని ద్రావిడుడు అనుకోవడం వల్లే సమస్య వస్తుందని స్వామి ఆరోపించారు. అసలు ఉత్తరాదిలో ఉన్న ఆర్యులకు, దక్షిణాదిలో ఉన్న ద్రావిడులకు మధ్య చిచ్చు పెట్టింది బ్రిటీష్ వారని.. వారు చరిత్ర పుస్తకాల్లో అన్నీ వక్రీకరించి రాశారని సుబ్రమణియన్ స్వామి తెలిపారు. మిషనరీ స్కూళ్లలో ఇలాంటి విషయాలే బోధించి పిల్లలను క్రిస్టియానిటీ వైపు మళ్లిస్తున్నారని స్వామి ఆరోపించారు.

Trending News