Noel tata appointed chairman of tata trusts chairman: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా నిన్న (శుక్రవారం)ముంబైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తర్వాత.. టాటా ట్రస్ట్ గ్రూప్ లకు చైర్మన్ గా.. నోయెల్ టాటా నియమితులయ్యారు. అక్టోబర్ 11న ముంబయిలో జరిగిన సమావేశంలో ఆయన నియామకం ఏకగ్రీవంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశమంతట ప్రజలు రతన్ టాటా మరణం పట్ల తీవ్ర శోకసంద్రంలో ఉన్నారు.
నోయల్ టాటా విషయానికి వస్తే.. ఆయన రతన్ టాటాకు వరుసకు సోదరుడు అవుతాు. సవతి తల్లి.. సిమోన్ టాటా కుమారుడు. ఆయన ఇదివరకే టాటా గ్రూప్ లోని వివిధ కంపెనీల్లో కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు.ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ వంటి దిగ్గజ కంపెనీలకు చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా.. స్టీల్, టైటాన్ లకు వైస్ చైర్మన్ గా కడా ఉన్నారు. దీనితో పాటు.. శ్రీ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులోను నోయల్ మెంబర్ గా కొనసాగుతున్నారు. అయితే.. తొలుత టాటా గ్రూప్ పగ్గాలపై అనేక రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ చివరకు మాత్రం ట్రస్ట్ సభ్యులు.. నోయల్ టాటావైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
రతన్ టాటా అంతిమ సంస్కారాలను మహా రాష్ట్ర సర్కారు అధికార లాంఛనాలతో నిన్న (శుక్రవారం)ముంబైలో పూర్తి చేసింది . రతన్ టాటా మరణం పట్ల అన్ని రంగాల వారు తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఒక సామాన్యుడు.. ఏవిధంగా అంచెలెంచెలుగా ఎదిగి ఒక ఉన్నతస్థానంలో ఎదగాడని చెప్పటానికి రతన్ టాటా జీవితమే కళ్ల ముందు కన్పిస్తున్న లైవ్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు. తన జీవితంలో ఎదురైన సవాళ్లను, మెట్లుగా మల్చుకొని మరీ కష్టపడి ఈ విధంగా టాటా గ్రూప్ సామ్రాజ్యంను ఏర్పాటు చేశాడు.
అయితే రతన్ టాటా ఎప్పుడు కూడా ఆడంబారాలకు పోకుండా.. ఎంతో సింపుల్ గా ఉండేవారు. నిత్యం తన దేశంకోసం ఏంచేయాలని తపనో ఉండేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బిజినెస్ రంగంలోనే కాకుండా.. మానవత్వంలోను రతన్ టాటా.. తనదైన ముద్రవేసుకున్నారు.
అందుకే రతన్ టాటాకు వయస్సుతో సంబంధం లేకుండా, మనదేశంలో పాటు.. ప్రపంచ దేశాలలో కూడా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన మరణం మాత్రం మన దేశానికి తీరని లోటు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికి కూడా చాలా మంది రతన్ టాటా గారు ఇక లేరన్న వార్తను మాత్రం జీర్ణించుకొలేకపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Noel Tata: టాటా ట్రస్ట్ చైర్మన్‌గా నోయల్ టాటా.. రతన్ టాటా స్థానంలో ఏకగ్రీవంగా ఎంపిక..
రతన్ టాటా మరణం పట్ల దేశం దిగ్భ్రాంతి..
నూతన ట్రస్ట్ చైర్మన్ గా నోయల్ టాటా..