RGV on Poonam Pandey: నీ వల్లే దేశమంతా చర్చ, నువు చేసింది తప్పు కాదు

RGV on Poonam Pandey: బాలీవుడ్ నటి,మోడల్ పూనం పాండే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరణవార్తల మధ్య బతికున్నానంటూ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఒక్కసారిగా హల్‌చల్ చేసింది. అసలేం జరిగిందంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 3, 2024, 04:30 PM IST
RGV on Poonam Pandey: నీ వల్లే దేశమంతా చర్చ, నువు చేసింది తప్పు కాదు

RGV on Poonam Pandey: ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనం పాండే నిన్నట్నించి వార్తల్లో ఉంది. గర్భాశయ కేన్సర్ కారణంగా ఆమె మరణించినట్టుగా అధికారి  ఇన్‌స్టా‌గ్రామ్‌లో వచ్చిన పోస్ట్ ఒక్కసారిగా అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. నిన్నట్నించి ఎక్కడ చూసినా ఇదే వార్త హాట్ టాపిక్‌గా మారింది.

దాదాపు 24 గంటలు ఆమె ఏమైందనే ప్రశ్నలు తలెత్తాయి. ఆమె బాడీ కన్పించలేదని, ఆమె కుటుంబసభ్యులు కన్పించడం లేదనే వార్తలు వెల్లువెత్తాయి. మరోవైపు అసలు గర్భాశయ కేన్సర్ అంటే ఏమిటి, ఎందుకొస్తుంది, చిన్న వయస్సువారికి కూడా ఈ సమస్య వస్తుందా అనేది పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. సరిగ్గా 24 గంటల తరువాత తాను బతికున్నానంటూ పోస్ట్ విడుదల చేసింది పూనం పాండే. అంతే ఒక్కసారిగా ఉత్కంఠ వీడిపోవడమే కాకుండా నెటిజన్లు పెద్దఎత్తున ఆమెపై మండిపడటం ప్రారంభించారు. 

అయితే పూనం పాండే ఇలా చేయడంపై ప్రముఖ వివాదాస్పద దర్శడుడు ఆర్జీవీ మాత్రం అండగా నిలుస్తున్నారు. గర్భాశయ కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పూనం పాండే ఎంచుకున్న పద్ధతి కొందరికి అర్ధం కాకపోవచ్చు కానీ ఆమె ప్రయత్నాన్ని ఎవరూ ప్రశ్నించేలేరంటూ ఆర్జీవీ వ్యాఖ్యానించారు. ఆమె వల్లనే ప్రస్తుతం గర్భాశయ కేన్సర్‌పై చర్చ విస్తృతమైంది. ఆమె చాలా ఏళ్లు ఆనందంగా బతకాలని కోరుకుంటున్నానంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 

గర్భాశయ కేన్సర్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ వేసుకోవాలని పూనం పాండే సూచించారు. ఈ అవగాహన కోసమే తానిలా చేయాల్సివచ్చిందన్నారు. నేను చావలేదు. ఆ కేన్సర్ నన్నింకా చంపలేదు. కానీ చాలా మందికి వచ్చే ప్రమాదముంది. దీనిపై అవగాహన కోసమే నేనీ నాటకమాడానంటూ పూనం పాండే చెప్పుకొచ్చింది. 

ఆర్జీవీ బాటలోనే మరి కొందరు నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. పూనం పాండే ఎంచుకున్న విధానం సరైంది కాకపోయినా మంచి అంశం ఎంచుకుందని, బాలికలు, మహిళలు అందరికీ దీనిపై అవగాహన కల్పించాలంటున్నారు. సర్వైకల్ కేన్సర్ రాకుండా ఉండేందుకు అందరికీ కేంద్ర ప్రభుత్వం వేక్సిన్ వేయించాలని నిర్ణయించింది. గర్భాశయ కేన్సర్‌తో ఏడాదికి 77 వేలమంది మరణిస్తున్నారు. 

Also read: CGHS Scheme Benefits: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లభించే సీజీహెచ్ఎస్ ప్రయోజనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News