Election Commission: భారత నూతన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్

భారతదేశ నూతన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్ నియామకమైంది. ఇటీవల రాజీనామా చేసిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు తీసుకోనున్నారు. 

Last Updated : Aug 21, 2020, 11:14 PM IST
Election Commission: భారత నూతన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్

భారతదేశ నూతన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్ ( Rajiv kumar ) నియామకమైంది. ఇటీవల రాజీనామా చేసిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు తీసుకోనున్నారు.  

1984 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ ను భారతదేశ నూతన ఎలక్షన్ కమీషనర్ ( New Election commissioner ) గా నియమిస్తూ న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల రాజీనామా చేసిన అశోక్ లావాసా ఆగస్టు 31న రిలీవ్ అవనున్నారు. ఆయన స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు తీసుకుంటారు. రాజీవ్ కుమార్ గతంలో ఆర్దికశాఖ కార్యదర్శిగా పనిచేశారు. జార్ఘండ్ కేడర్ కు చెందిన రాజీవ్ కుమార్ ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 క్లాజ్ 2 ప్రకారం రాష్ట్రపతి నియమించారని నోటిఫికేషన్లో ఉంది.  అటు రాజీనామా చేసిన అశోక్ లావాసా ( Ashok lavasa ) ఆసియన్ డవలప్మెంట్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. Also read: Kerala: విజయన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం

 

Trending News