''రజినీకాంత్ నిరక్షరాస్యుడు''.. సుబ్రహ్మణ్యన్ స్వామి సంచలన వ్యాఖ్యలు

రజినీకాంత్ ఓ నిరక్షరాస్యుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యన్ స్వామి. అంతటితో ఆగని బీజేపీ అగ్రనేత మరిన్ని ఆరోపణలతో రజినీకాంత్‌పై విమర్శల దాడి మొదలుపెట్టారు.

Last Updated : Dec 31, 2017, 01:10 PM IST
''రజినీకాంత్ నిరక్షరాస్యుడు''.. సుబ్రహ్మణ్యన్ స్వామి సంచలన వ్యాఖ్యలు

రజినీకాంత్ ఓ నిరక్షరాస్యుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యన్ స్వామి. అంతటితో ఆగని బీజేపీ అగ్రనేత.. రజినీకాంత్ మీడియాలో ప్రచారం కోసమే తనకి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించుకున్నారు తప్పితే ఆ ప్రకటనలో ఏ మాత్రం పస లేదు అని ఆరోపించారు. రజినీకాంత్ రాజకీయ పార్టీ పెడుతున్నానని ప్రకటించారే తప్పితే అంతకుమించి ఇతర వివరాలు వెల్లడించడం కానీ లేదా పత్రాలు విడుదల చేయడం కానీ జరగలేదని చెప్పే క్రమంలో ఆయన ఓ నిరక్షరాస్యుడు అని అన్నారు సుబ్రహ్మణ్యన్ స్వామి. అదే క్రమంలో తమిళనాడు జనాలు చాలా తెలివిగల వారు. వారికి అన్ని తెలుసు అని వ్యాఖ్యానించారు. రజినీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించడంపై ఏఎన్ఐతో మాట్లాడుతూ సుబ్రహ్మణ్యన్ స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.

రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన అనంతరం తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఓవైపు సూపర్ స్టార్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటోంటే, రజినీకాంత్ ఎంట్రీతో తమపై ఎటువంటి ప్రభావం వుంటుందా అని అంచనాలు వేసుకునేపనిలో ఇతర రాజకీయపక్షాలు నిమగ్నమయ్యాయి. 

Trending News