రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. 10 టైర్లు ఉన్న లారీ.. జీపును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జోధ్ పూర్ జిల్లాలోని బలోత్రా- ఫలోడి జాతీయ రహదారిపై జరిగింది. ప్రస్తుతం తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారనే విషయాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో జీపు నుజ్జునుజ్జు అయిపోయింది. లారీ పూర్తిగా జీపుపై ఎక్కడంతో కనీసం ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. అంటే అతి వేగంతోనే లారీ వచ్చి జీపును ఢీకొట్టి ఉండవచ్చని తెలుస్తోంది. ఐతే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్థానికులు ఏం చెప్పలేకపోతున్నారు. ఐతే లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండవచ్చని.. లేదా మద్యం తాగి డ్రైవ్ చేసి ఉండవచ్చని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్వల్ప గాయాలపాలైన డ్రైవర్ జాడ కనిపించడం లేదు.
Read Also: హ్యాండ్ శానిటైజర్ ఇంట్లో తయారు చేయడం ఎలా..?
ప్రస్తుతం పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. లారీ నంబర్ ఆధారంగా కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..