ఛుక్ ఛుక్ రైలు వచ్చేస్తోంది..

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ విధించి 47 రోజులు పూర్తైయింది. కాగా మార్చి 25న ప్రకటించబడిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్నీ ప్రధాన నగరాల్లో చిక్కుకు పోయిన విద్యార్థులు, యాత్రికులు 

Last Updated : May 10, 2020, 11:52 PM IST
ఛుక్ ఛుక్ రైలు వచ్చేస్తోంది..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ విధించి 47 రోజులు పూర్తైయింది. కాగా మార్చి 25న ప్రకటించబడిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్నీ ప్రధాన నగరాల్లో చిక్కుకు పోయిన విద్యార్థులు, యాత్రికులు ఇతరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 12 నుంచి రైళ్లు నడపాలని నిర్ణయించగా ఈ మేరకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే దేశ రాజధాని ఢిల్లీ నుండి దేశవ్యాప్తంగా 15 నగరాలకు ప్రయాణికుల రైళ్లు నడపనున్నట్లు  భారతీయ రైల్వే ఈ మేరకు ఓ  పేర్కొంది. 

ఇందుకుగాను సోమవారం సాయంత్రం 4 గంటల నుండి ఐఆర్ సీటీసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే ఢిల్లీ నుండి సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై సెంట్రల్, తిరువనంతపురం, అహ్మదాబాద్, జమ్మూతావి, అగర్తలా, హౌరా, పాట్నా, దిబ్రూగఢ్, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్ నగరాలకు రైళ్లను నడపనున్నట్లు ఇండియన్ రైల్వే తెలిపింది. ప్రయాణికులు ధరించాలని, అన్నీ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కరోనా లక్షణాలు లేనివారినే స్క్రీనింగ్ చేసిన తరవాతనే రైళ్లలో అనుతిస్తారని భారతీయ రైల్వే పేర్కొంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News