ప్రధాని మోదీ ఈ విపత్తును కనిపెట్టలేకపోతున్నారా..

ప్రపంచమంతా ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో మరోవైపు భారతదేశం ఆర్ధిక మందగమనంతో కొట్టుమిట్టాడుతోంది. అయితే దేశంలో అతిపెద్ద ఆర్థిక ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి అందరూ సంసిద్ధం కావాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు  రాహుల్ గాంధీ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో

Last Updated : Mar 17, 2020, 08:42 PM IST
ప్రధాని మోదీ ఈ విపత్తును కనిపెట్టలేకపోతున్నారా..

న్యూఢిల్లీ: ప్రపంచమంతా ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో మరోవైపు భారతదేశం(Economic Slowdown)ఆర్ధిక మందగమనంతోతో కొట్టుమిట్టాడుతోంది. అయితే దేశంలో అతిపెద్ద ఆర్థిక ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి అందరూ సంసిద్ధం కావాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు  రాహుల్ గాంధీ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఆర్ధిక ఆందోళనను సునామీతో పోలుస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఇరుక్కుపోయిందని, దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించలేమని హెచ్చరించారు. కాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2004లో అండమాన్ నికోబార్ దీవులను అతలాకుతలం చేసిన సునామీని ఈ సందర్బంగా గుర్తు చేశారు. 

Read Also: దాన్ని నేను వ్యతిరేకించట్లేదు.. కానీ..

 అప్పటి పరిస్థితులను గుర్తు చేస్తూ హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న పరివాహక ప్రాంతాలన్నీ కనుమరుగయ్యాయని ఆయన అన్నారు. ఇప్పడు అటువంటి విపత్కర ఉపద్రవం వచ్చేలా ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రధాని మోదీ ఈ విపత్తును కనిపెట్టలేకపోతున్నారని, పరిణామాలు అంచనా వేయలేకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం కరోనా మహమ్మారితోపాటు రానున్న ఆర్థిక విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. 
  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read Also: కింగ్ కోబ్రానే మట్టికరిపించిన ముంగూస్ వీడియో వైరల్...

Trending News