Pune porsche car crash: పూణే పోర్షే కారు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. కారు నడిపింది ఫ్యామిలీ డ్రైవర్..?..

Pune porsche car accident: పూణే మైనర్ బాలుడు ర్యాష్ గా డ్రైవింగ్ చేసి ఇద్దరు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. దీనిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. మైనర్ బాలుడికి కోర్టు విధించిన పనిష్మెంట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : May 24, 2024, 02:27 PM IST
  • పూణే ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహాం..
  • కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు..
 Pune porsche car crash: పూణే పోర్షే కారు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. కారు నడిపింది ఫ్యామిలీ డ్రైవర్..?..

Pune kalyani nagar porsche car accident: పూణే రోడ్డు ప్రమాదానికి కారణమైన బాలుడి ఘటనలో రోజుకోక ట్విస్టులు వెలుగులోనికి వస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటి కే పోలీసులు మైనర్ బాలుడిని అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచారు. దీనిపై మైనర్ బాలుడికి, జరిగిన ప్రమాదంపై 300 పేజీల వ్యాసం రాసి.. 15 రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పనిచేయాలని, మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, భవిష్యత్తులో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని న్యాయస్థానం బాలుడికి ఆదేశించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు మైనర్ ను మరొసారి అదుపులోకి తీసుకుని, కోర్టు ఆదేశాల మేరకు జువైనల్ హోమ్ కు తరలించారు. ఇక తాజాగా, ఈ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

Read more: Swati maliwal: ఎన్నికల వేళ మరో బాంబు పేల్చిన స్వాతీమలీవాల్.. అసలేం జరిగిందంటే..?

 ప్రమాదం జరిగినప్పుడు కారును తమ ఫ్యామిలీ డ్రైవర్ నడిపాడని మైనర్ తండ్రి విశాల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఈ నేపథ్యంలో పూణే పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి తమ దైన స్టైల్ లో విచారణ ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రాథమికంగా పోలీసులు డ్రైవర్ కు భారీ ఎత్తున డబ్బుల ఆశచూపి, ఈ నేరం తనమీద వేసుకొవాలని డ్రైవర్ ను కోరినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతానికి లోతైన విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పూణే - కళ్యాణి నగర్‌లో బ్రహ్మ రియాల్టీకి చెందిన విశాల్ అగర్వాల్ కుమారుడు వేదాంత్ అగర్వాల్ మద్యం మత్తులో బీభత్సం చేశాడు. మే 17, ఆదివారం రోజున ఇంటర్మీడియట్ రిజల్ట్ నేపథ్యంలో ఫుల్ గా తాగి ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల.. బైక్ నడుపుతున్న అనీష్ అవధియా (24) , అశ్విని కోష్ట (25) 20 అడుగుల మేర గాలిలోకి ఎగిరికిందపడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరూ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కూడా లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు కేవలం కొన్నిగంటల వ్యవధిలో మైనర్ బాలుడు 48 వేల  రూపాయలను మద్యం షాపులో ఖర్చుచేసినట్లు పోలీసులు గుర్తించారు.

మైనర్ కు మద్యం సరఫరా చేసిన వైన్ షాపులకు పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ ఘటన ప్రస్తుతం పోలిటికల్ టర్న్ తీసుకుందని తెలుస్తొంది. మైనర్ కు పోలీసులు బిరియానీలు, పిజ్జాలు సప్లై చేశారంటూ కూడా అనేక ఆరోపణలు వచ్చాయి.  బడాబాబుల పిల్లలకు పోలీసులు వీఐపీలాగా చూసుకున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా పీఎస్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే మైనర్ బాలుడి తల్లిదండ్రులను విచారించిన సంగతి తెలిసిందే.

Read more: Kedarnath Dham: కేదార్ నాథ్ యాత్రలో షాకింగ్ ఘటన... గాలిలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్.. వీడియో వైరల్..

అయితే.. విశాల్ అగర్వాల్ తమ దర్యాప్తుకు సహకరించలేదని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెషన్ కోర్టు అనుమతితో.. రెండు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఒకసారి షిర్డీ, మరోసారి ఔరంగాబాద్ లో ఉన్నానని చెప్పి, పోలీసులను తప్పుదొవ పట్టించినందుకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News