Maharashtra pune porsche accident: మహారాష్ట్రలోని పూణేలో ఒక మైనర్ బాలుడు చేసిన పని ప్రస్తుతం రచ్చగా మారింది. పూణే - కళ్యాణి నగర్‌లో బ్రహ్మ రియాల్టర్ చెందిన విశాల్ అగర్వాల్ కుమారుడు వేదాంత్ అగర్వాల్. ఇతగాడు.. ఆదివారం రోజున మద్యం మత్తులో తన స్పీడ్ పోర్షే కారుతో వేగంగా వెళ్లి ఇద్దరిని ఢీకొట్టాడు. ఈ ఘటన తర్వాత బాధితులు కారుపై దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రమాదం జరిగిన 15 గంటల్లోనే కోర్టు మైనర్ కు బెయిల్ మంజురు చేయడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. మైనర్ లో బాలుడు.. వైన్ షాపులో తాగుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా.. బాలుడికి కొన్ని షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరి మృతికి కారణమైన మైనర్
వీడియోలో వేదాంత్ అగర్వాల్ తన స్నేహితులతో మద్యం తాగుతున్నట్టు ఉంది.. కానీ ఆల్కహాల్ టెస్ట్ రిజల్ట్ నెగిటివ్‌గా వచ్చింది. అంతే కాదు ప్రమాదం చేసిన 15 గంటల్లోనే బెయిల్ కూడా వచ్చింది. https://t.co/2zwCsSFOfB pic.twitter.com/GmDc7aM5Zf
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2024
అంతేకాకుండా.. జరిగిన ప్రమాదంపై 300 పేజీల వ్యాసం రాసి.. 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని సూచించింది. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, భవిష్యత్తులో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని న్యాయస్థానం బాలుడికి ఆదేశించింది. దీనిపై దేశంలో సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. బాలుడు అరెస్టు తర్వాత పోలీసు స్టేషన్ లో ఉండగా.. అతనికి బిర్యానీ, పిజ్జాలు కూడా పెట్టినట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రముఖ వ్యక్తి కుమారుడు కావడం వల్లనే పీఎస్ లో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు అందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మరోవైపు.. కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పీఎస్ కు చేరుకుని నిరసనలు తెలియజేస్తున్నారు. వెంటనే బెయిల్ రద్దు చేసి చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా మైనర్ కు మద్యం సరఫరా చేసిన ఇద్దరు బార్ ల యజమానులనులపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read more: Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?
మరోవైపు మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరి మృతికి కారణమైన మైనర్.. వీడియోలో వేదాంత్ అగర్వాల్ తన స్నేహితులతో మద్యం తాగుతున్నట్టు ఉంది.. కానీ ఆల్కహాల్ టెస్ట్ రిజల్ట్ నెగిటివ్ రావడం గమనార్హం. అంతే కాదు ప్రమాదం చేసిన 15 గంటల్లోనే బెయిల్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter