రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక: అరుణ్ జైట్లీకి స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోదీ

రాజ్యసభలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం

Last Updated : Aug 9, 2018, 04:44 PM IST
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక: అరుణ్ జైట్లీకి స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోదీ

నేడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి బీకే హరిప్రసాద్‌పై ఎన్డీఏ తరపు అభ్యర్థి, జేడీ(యు) నేత హరివంశ్ నారాయణ్ సింగ్ 20 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నిక అనంతరం రాజ్యసభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రదాని నరేంద్ర మోదీ.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి కొత్తగా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్‌కి అభినందనలు తెలిపారు. అనంతరం రెనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత తొలిసారిగా నేటి రాజ్యసభ సమావేశాలకు హాజరైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి హార్థిక స్వాగతం పలుకుతున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు.

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అరుణ్ జైట్లీ గత మే నెలలో రెనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ కారణంగా అప్పటి నుంచి పార్లమెంట్ సమావేశాలకు, అనేక అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఇవాళే తొలిసారిగా రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అరుణ్ జైట్లీకి స్వాగతం పలికారు.

Trending News