Precaution Doses: 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రికాషన్​ టీకా.. ఒక్క డోసు ధర ఎంతంటే?

Precaution Doses: దేశంలో కరోనా టీకాల విషయంలో మరో కీలక ముందడుకు వేసింది ప్రభుత్వం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు నిబంధనలకు లోబడి బూస్టర్ డోసు వేసుకునేందుకు అనుమతినిచ్చింది. మరి ప్రికాషన్ డోసు ధర ఎంతో తెలుసా?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2022, 08:30 PM IST
  • కరోనా టీకాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
  • 18 ఏళ్లు నిండిన వారంతా బూస్టర్​ డోసుకు అర్హులు
  • ప్రికాషన్ డోసు ధరలు వెల్లడించిన సీరమ్ సీఈఓ
Precaution Doses: 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రికాషన్​ టీకా.. ఒక్క డోసు ధర ఎంతంటే?

Precaution Doses: ఈ నెల 10 నుంచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు బూస్టర్ డోసు (ప్రికాషన్​) తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిస్తూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై వ్యాక్సిన్​ ఉత్పత్తి తయారీ సంస్థ సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

అయితే బూస్టర్​ డోసు కేవలే ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లోనే అందుబాటులోకి ఉండనున్న నేపథ్యంలో.. వ్యాక్సిన్ ధర ఎంత ఉండొచ్చని చర్చించుకుంటున్నారు చాలా మంది. ఈ విషయంపై కూడా అదర్ పూనావాలా స్పష్టతనిచ్చారు. కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ ధర ఒక డోసుకు రూ.600గా ఉంటుందని వివరించారు (పన్నులు అదనం). ఈ వ్యాక్సిన్ ఇంతకు ముందు కూడా ఇదే ధరలో అందుబాటులో ఉండటం గమనార్హం.

ఇక సీరమ్​ ఉత్పత్తి చేస్తున్న మరో కొవిడ్ వ్యాక్సిన్ కొవావాక్స్ ధరను ఒక్కో డోసుకు రూ.900 (పన్నులు అదనం) నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రముఖ వార్తా సంస్థ ఎన్​డీటీవీతో మట్లాడిన అదర్​ పూనావాలా ఈ విషయాలను వెల్లడించారు.

బూస్టర్ డోసు ఎవరు తీసుకోవచ్చు?

ఇప్పటి వరకు 60 ఏళ్లు నిండిన వారు, ఏదైనా దీర్ఘకాలిక సమస్యతో బాద పడుతున్న వారికి మాత్రమే దేశంలో బూస్టర్​ డోసు తీసుకునే అనుమతి ఉంది. అయితే అందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించింది. ఇప్పుడు 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు బూస్టర్​ డోసు తీసుకోవచ్చని.. ప్రైవేటు కేంద్రాల్లోనే ఇందుకు అనుమతి ఉంటుందని వెల్లడించింది.

తొలి రెండు డోసుల టీకా తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు ప్రికాషన్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ అయితే తీసుకుంటారో.. ప్రికాషన్ డోసు కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలి అని ఆరోగ్య విభాగం ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. దేశంలో వ్యాక్సిన్ తొలి రెండు డోసుల వ్యాక్సిన్ ఉంచితంగా అందిచే కార్యక్రమం యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది ప్రభుత్వం.

ప్రస్తుతం భారత్​లో కరోనా పరిస్థితులు అదుపులో ఉన్నా.. చైనా సహా పలు దేశాల్లో మళ్లీ ఆందోళనకర స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. దీనితో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. అందుకే బూస్టర్​ డోసు తీసుకున్న వారినే దేశంలోకి అనుమతించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథఫ్యంలో భారత ప్రభుత్వం ప్రికాషన్ డోసు ప్రతి ఒక్కరు తీసకునేందుకు వీలుగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Also read: Precaution Dose: కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన... 18 ఏళ్లు పైబడినవారికి ప్రికాషన్ డోసులు...

Also read: Shashi Tharoor Memes: మహిళా ఎంపీతో ముచ్చట్లు.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఎంపీపై ఫన్నీ మీమ్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News