Pranab Mukherjee childhood: అప్పుడు రోజూ 10 కి.మీ నడిచిన ప్రణబ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ( Pranab Mukherjee ) ఇక లేరనే చేదు నిజాన్ని యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. వివాదాలకు దూరంగా.. అజాతశత్రువుగా అందరి మనసు దోచుకున్న నాయకుడు ఆయన. తన జీవితాన్ని అంతా ప్రజాసేవకే ధారపోసిన ఆ రాజకీయ దిగ్గజం అంటే ఎవరికైనా ఇష్టమే.

Last Updated : Aug 31, 2020, 11:00 PM IST
Pranab Mukherjee childhood: అప్పుడు రోజూ 10 కి.మీ నడిచిన ప్రణబ్

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ( Pranab Mukherjee ) ఇక లేరనే చేదు నిజాన్ని యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. వివాదాలకు దూరంగా.. అజాతశత్రువుగా అందరి మనసు దోచుకున్న నాయకుడు ఆయన. తన జీవితాన్ని అంతా ప్రజాసేవకే ధారపోసిన ఆ రాజకీయ దిగ్గజం అంటే ఎవరికైనా ఇష్టమే. సుదీర్ఘకాలం పాటు ప్రజా సేవలో ఉన్నా.. ఎన్నో విజయాలు అందుకున్నా.. ఏ మాత్రం గర్వం లేని నాయకుడు. అందుకే ఆయన మరణం పార్టీలకు అతీతంగా అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఐతే ఆయన ఈ స్థాయికి చేరడం వెనుక కఠోర శ్రమ దాగి ఉంది. 1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్ బీర్భూమ్‌ జిల్లాలోని మిరాటి ( Pranab Mukherjee's birth place ) అనే ఓ మారుమూల పల్లెటూరిలో జన్మించిన ప్రణబ్ ముఖర్జి.. బాల్యంలో చదువుకునే రోజుల్లో పాఠశాలకు వెళ్లడం కోసం రోజూ 10 కిమీ నడిచేవారట ( walked 10 km to school ). ఈ విషయాన్ని ఓసారి పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఆయనే స్వయంగా వెల్లడించారు. Also read : BREAKING: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

2010 ఆగస్టులో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ( Parliament winter sessions ) ధరల పెరుగుదలని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ముఖ్యంగా అంతకు కొద్ది రోజుల క్రితమే అప్పటి యూపిఏ ప్రభుత్వం కిరోసిన్ ( Kerosene ), ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ( LPG gas cylinder prices ) పెంచింది. ఇదే విషయమై ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆందోళనకు దిగాయి. Also read : COVID-19: 4 వేలకు చేరువలో కరోనా మృతుల సంఖ్య

ప్రతిపక్షాల ఆందోళనకు జవాబు చెప్పే క్రమంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జి మాట్లాడుతూ.. ''తాను కూడా పల్లెటూరి వాడినేనని.. తాను చిన్నప్పటి రోజుల్లో ఎలాంటి రవాణా సదుపాయాలు ఉండేవి కావని అన్నారు. చిన్న తనంలో చదువు కోసం బడికి వెళ్లాలంటే రోజూ 10 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకున్నానని.. పేదల కష్టాలు తనకు తెలియనివి కావు'' అని గుర్తుచేసుకున్నారు. బీర్భూమ్‌ జిల్లాలోని సూరి విద్యాసాగర్ కళాశాలలో, కోల్‌కతా యూనివర్సిటీలో ప్రణబ్ ముఖర్జీ తన ఉన్నత విద్యను అభ్యసించారు. Also read : Prashat Bhushan: సుప్రీంకోర్టుకు జరిమానా చెల్లించేందుకు సిద్ధమైన ప్రశాంత్‌ భూషణ్

Trending News