/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై ఎట్టకేలకు సీబీఐ స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ నమోదు చేసింది. ఆయనతో పాటు తన మావయ్య మెహుల్ చోక్సీపై కూడా ఇదే వారెంట్ నమోదు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు 2 బిలియన్ డాలర్లు ఎగనామం పెట్టిన కేసులో తాజాగా వీరికి వారెంట్ ఇష్యూ అయ్యింది. గతంలో విచారణ నిమిత్తం హాజరవ్వాల్సిందిగా వీరిద్దరినీ సీబీఐ కోర్టు ఈమెయిల్ ద్వారా కోరగా.. వివిధ కారణాలు చూపించి వారు హాజరు కాలేదు.

ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేదని.. వ్యాపారానికి సంబంధించిన పనుల్లో ఉన్నామని వారు చెప్పడం జరిగింది. అయితే కేసుకు సంబంధించిన పరిస్థితి మరీ దిగజారుతున్నందున.. వారికి ఎట్టకేలకు సీబీఐ నాన్ బెయిలబుల్ వారెంటు ఇష్యూ చేసింది. కేసు తీవ్రతను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇటీవలే భారత ప్రభుత్వం నీరవ్ మోదీ హాంగ్‌కాంగ్‌లో ఉన్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. అదే దేశంలో అతన్ని అరెస్టు చేయడానికి కూడా అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు. వారిని భారత్ తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. ఇప్పటికే సీబీఐ నీరవ్ మోదీతో పాటు మెహుల్ చోక్సీపై కూడా మనీ ల్యాండరింగ్‌కు సంబంధించి రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 

Section: 
English Title: 
PNB Scam: Non-bailable Warrants Issued Against Nirav Modi, Mehul Choksi
News Source: 
Home Title: 

నీరవ్ మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్

నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలపై నాన్ బెయిలబుల్ వారెంట్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలపై నాన్ బెయిలబుల్ వారెంట్