PM Ujjwala Yojana Scheme: కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం ద్వారా పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం చేపట్టిన ఈ పథకంతో నాలుగేళ్లలోనే దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ వినియోగం గణనీయంగా పెరిగింది. 2016లో 62 శాతంగా ఉన్న ఎల్‌పీజీ కవరేజీ 2022లో 104.1శాతానికి చేరింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 167.2 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 109.1శాతం, బీహార్‌లో 101 శాతం ఎల్‌పీజీ కవరేజీ ఉంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వివరాలను వెల్లడించింది.
గడిచిన ఆరేళ్లలో పీఎం ఉజ్వల యోజన పథకం కింద 9 కోట్ల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లను ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం లబ్దిదారుల్లో 35.1శాతం మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలే ఉండటం గమనార్హం. ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలు పొగచూరే కట్టెల పొయ్యి వద్ద కూర్చొని వంట చేసే బాధ తప్పింది. ఉజ్వల పథకం రాకతో పొగ కారణంగా సంభవించే మరణాలు 2019లో 13 శాతం మేర తగ్గాయి. మే 1, 2016న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఆగస్టు 2021న దానికి కొనసాగింపుగా ఉజ్వల యోజన 2.0 పథకం తీసుకొచ్చారు. మొదట 5 కోట్ల మంది పేద మహిళలకు ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... ఉజ్వల యోజన 2.0 ద్వారా దాన్ని 8 కోట్ల కనెక్షన్ల వరకు తీసుకెళ్లగలిగింది. ఉజ్వల యోజన పథకానికి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...
ఎవరు అర్హులు :
ఉజ్వల యోజన పథకానికి మహిళలు మాత్రమే అర్హులు. తప్పనిసరిగా 18 ఏళ్లు నిండినవారై ఉండాలి.
గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారై ఉండాలి. తప్పనిసరిగా బీపీఎల్ కార్డును కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే మహిళకు తప్పనిసరిగా ఏదేని జాతీయ బ్యాంకులో సేవింగ్ ఖాతా ఉండాలి. తద్వారా సబ్సిడీ మొత్తం వారికి అందుతుంది.
రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు కలిగి ఉండాలి. రీసెంట్‌గా దిగిన ఫోటో అవసరం.
ఇదివరకే ఎల్‌పీజీ కనెక్షన్ ఉండి ఉంటే మళ్లీ కనెక్షన్ తీసుకోవడానికి అనర్హులు.
దరఖాస్తు ప్రక్రియ :
మొదట https://www.pmuy.gov.in/ujjwala2.html సైట్‌ను ఓపెన్ చేయండి.
హోంపేజీలో 'Click Here to apply for New Ujjwala 2.0 Connection' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఇందన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్.. ఈ మూడింటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకోండి.
మీ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి.
అదే నంబర్‌తో లాగిన్ అయి అక్కడ పేర్కొన్న వివరాలను పొందుపరచండి. లేదా ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసి.. అందులో వివరాలు నింపిన తర్వాత, సమీపంలోని ఎల్‌పీజీ సెంటర్‌లో అందజేయండి. అంతే.. కొద్దిరోజుల్లోనే మీకు గ్యాస్ కనెక్షన్ అందుతుంది.
PM @narendramodi launched Pradhan Mantri #Ujjwala Yojana to safeguard the health of women and children by providing them with clean cooking
fuel, so that they don’t have to compromise their health in a smoky kitchen.Read more: https://t.co/vR79IP930w pic.twitter.com/zQK41Z8Fc0
— PIB India (@PIB_India) April 24, 2022
Also Read: 2 Collection: బాలీవుడ్ లో 'కేజీఎఫ్ 2' హవా.. 'బాహుబలి 2' రికార్డులను కొల్లగొడుతోందా?
Also Read: Corona Fourth Wave: దేశంలో పెరుగుతున్న కరోనా ఫోర్త్‌వేవ్ భయం, ఏప్రిల్ 27న సమీక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.