PM Modi meet with CM's: దేశంలో మళ్లీ లాక్‌డౌన్? నేడు సీఎంలతో ప్రధాని మోదీ భేటీపై ఉత్కంఠ..

PM Modi meet with CM's:  తాజా భేటీలో కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్, వైరస్ కట్టడి చర్యలపై ప్రధాని సీఎంలతో చర్చించే అవకాశం ఉంది. వైరస్ కట్టడికి అనుసరించాల్సిన చర్యలపై సీఎంల నుంచి సలహాలు, సూచనలు కోరే అవకాశం ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 11:15 AM IST
  • నేడు సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
  • సాయంత్రం 4.30గంటలకు జరగనున్న వర్చువల్ సమావేశం
  • కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్, వైరస్ కట్టడి చర్యలపై చర్చించే అవకాశం
PM Modi meet with CM's: దేశంలో మళ్లీ లాక్‌డౌన్? నేడు సీఎంలతో ప్రధాని మోదీ భేటీపై ఉత్కంఠ..

PM Modi meet with CM's: దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఎనిమిదంటే ఎనిమిది రోజుల్లో రోజువారీ కేసుల సంఖ్య 10వేల మార్క్ నుంచి 1 లక్ష మార్క్‌ను దాటింది. ఇక ఇప్పుడు ఏకంగా 2 లక్షల మార్క్‌ని దాటేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ముందు జాగ్రత్తగా నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలను అమలుచేస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా భేటీ కానున్నారు. నేటి (జనవరి 13) సాయంత్రం 4.30గంటలకు సీఎంలతో ప్రధాని భేటీ జరగనుంది.

ఈ ఏడాది ఆరంభంలోనే ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ కాబోతుండటం గమనార్హం. తాజా భేటీలో కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్, వైరస్ కట్టడి చర్యలపై ప్రధాని సీఎంలతో చర్చించే అవకాశం ఉంది. వైరస్ కట్టడికి అనుసరించాల్సిన చర్యలపై సీఎంల నుంచి సలహాలు, సూచనలు కోరే అవకాశం ఉంది. తద్వారా దేశంలో నెలకొన్న పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.

మూడు రోజుల క్రితం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో కోవిడ్ కట్టడికి ప్రధాని పలు కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. జిల్లాల్లో వైద్యపరమైన మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. కోవిడ్‌ను కట్టడి చేసేందుకు అందుబాటులో ఉన్న మార్గాల్లో వ్యాక్సినేషనే ఉత్తమమని పేర్కొన్నారు.

ఒక్క రోజు వ్యవధిలోనే 27 శాతం పెరిగిన కేసులు :

దేశవ్యాప్తంగా బుధవారం (జనవరి 12) 1,94,720 కొత్త కరోనా కేసులు (Covid cases in India) నమోదవగా.. గురువారం (జనవరి 13) ఒక్కరోజే 2,47,417 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 27శాతం మేర (52 వేలు) కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పరిశోధకులు అంచనా వేస్తున్నట్లు వచ్చే ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా పీక్స్‌కి చేరవచ్చు. అదే జరిగితే రోజుకు 5లక్షల కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. 

Also Read: Sankranti 2022: కరోనా కేసులు పెరిగినా.. హైదరాబాద్‌లో ఆగని కైట్స్ విక్రయాల జోరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News