న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ప్రారంభమైంది. కోవిడ్-19 లాక్ డౌన్ సడలింపు, ప్రజా రవాణా, ఆర్థిక పరిస్థితుల వంటి అంశాలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చకొచ్చినట్లు సమాచారం. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడారు. అన్నీ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడిపై, లాక్ డౌన్ అమలు విధి విధానాలపై తాజా సమాచారాన్ని అడిగి తెలుసుకునట్టు తెలిపారు.
మరోవైపు ప్రధాని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతూ ప్రస్తుతం మనందరి ముందు ఓ సవాల్ ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోని గ్రామాలకు కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు సంక్రమణను నివారించడమే మన ముందున్న తక్షణ కర్తవ్యమని ప్రధాని మోదీ సీఎంలతో అన్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మనముందున్న అతి పెద్ద సవాల్ ఇదే.. ప్రధాని మోదీ