బ్రేకింగ్: మే 3 వరకు లాక్ డౌన్ పొడగింపు

21 రోజుల లాక్ డౌన్ ముగుస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతోనే కరోనా మహమ్మారిని చాలా  వరకు అడ్డుకోగలిగామని చెప్పారు. అంతే కాదు కరోనా మహమ్మారి ఇంకా లొంగి రానందున  మే 3 వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Last Updated : Apr 14, 2020, 11:02 AM IST
బ్రేకింగ్: మే 3 వరకు లాక్ డౌన్ పొడగింపు

21 రోజుల లాక్ డౌన్ ముగుస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతోనే కరోనా మహమ్మారిని చాలా  వరకు అడ్డుకోగలిగామని చెప్పారు. అంతే కాదు కరోనా మహమ్మారి ఇంకా లొంగి రానందున  మే 3 వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

భారత దేశంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాని సమయంలోనే.. మిగతా దేశాల నుంచి వచ్చే వారికి కోవిడ్ 19 పరీక్షలు చేయడం మొదలు పెట్టిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కరోనా పాజిటివ్ కేసులు పెరిగే వరకు చూడలేదని చెప్పుకొచ్చారు. అన్ని దేశాల కంటే ముందస్తుగానే భారత్ అప్రమత్తమైందని తెలిపారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఒకవేళ ముందస్తు చర్యలు తీసుకోకుంటే పరిస్థితి ఎంత దిగజారి ఉండేదో.. ఊహించుకుంటేనే భయం వేస్తోందని ప్రధాని మోదీ అన్నారు.

'కరోనా వైరస్' కోసం పరీక్షలు చేసేందుకు దేశవ్యాప్తంగా 220  ప్రయోగశాలలు నిరంతరం పని చేస్తున్నాయని  ప్రధాని మోదీ తెలిపారు. 10 వేల పాజిటివ్ కేసులు ఉన్నపక్షంలో 1500 నుంచి 1600 బెడ్లు ఉన్న ఆస్పత్రులు అవరమని ప్రపంచ దేశాలను చూస్తే అర్థమవుతుందని ఆయన అన్నారు. ఐతే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ను ధీటుగా ఎదుర్కునేందుకు 600 ఆస్పత్రుల్లో లక్ష పడకలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఇంకా ఈ సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.

ఏప్రిల్ 20 వరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలను, కాలనీలను దగ్గరునుంచి పర్యవేక్షిస్తామని ప్రధాని మోదీ అన్నారు. లాక్ డౌన్ ఎప్పటిలాగే పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. హాట్ స్పాట్లు ఎట్టి పరిస్థితుల్లో పెరగకూడదని మోదీ కోరారు.  ముఖ్యమైన పనులు చేసుకునేందుకు ప్రజలకు అవకాశం కల్పిస్తూనే షరతులతో కూడిన లాక్ డౌన్   అమలు చేయాలని సూచించారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ప్రధాని ప్రస్తావించారు.  ప్రస్తుతం రబీ పనులు జరుగుతున్నందున వారి సమస్యలను అర్ధం చేసుకున్న కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు  కలిసి పని చేస్తాయని తెలిపారు. పేదలు, రోజువారీ కూలీలు కూడా ఆందోళన చెందవద్దన్నారు. కొద్ది రోజులు మాత్రమే ఈ సమస్య ఉంటుందని.. తర్వాత అంతా సర్ధుకుంటుందని భరోసా ఇచ్చారు.

ఇప్పటికే లాక్ డౌన్ పొడగించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని మోదీని కోరాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను ఏప్రిల్ 30వరకు పొడగించినట్లు పేర్కొన్నాయి. ఐతే రాష్ట్రాలు కోరిన విధంగా కాకుండా మే 3  వరకు లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు. మే 1న కార్మికుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు  దినంగా ఉంటుంది. ఆ తర్వాతి రోజు శనివారం, ఆదివారం వస్తున్నాయి. కాబట్టి.. మే 3 వరకు లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News