PM Modi Convoy: పిఎం మోదీ రోడ్‌షోలోకి అంబులెన్స్ ఎంట్రీ.. అప్పుడేం జరిగిందంటే..

PM Modi Convoy : గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మెదాబాద్‌లోని దూరదర్శన్ సెంటర్ వద్ద ప్రదాని మోదీ కాన్వాయ్ ఉండగా.. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తున్న మార్గంలోనే ఓ అంబులెన్స్ కుయ్ కుయ్ అంటూ అటువైపుగా దూసుకొచ్చింది.  

Written by - Pavan | Last Updated : Dec 1, 2022, 09:01 PM IST
  • గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పీఎం మోదీ
  • అహ్మెదాబాద్ రోడో షోలో పీఎం మోదీ సందడి
  • రోడ్డుషోలో ఉండగానే అదే మార్గంలో వచ్చిన అంబులెన్స్
  • వెంటనే స్పందించిన ప్రధాని మోదీ ఏం చేశారంటే..
PM Modi Convoy: పిఎం మోదీ రోడ్‌షోలోకి అంబులెన్స్ ఎంట్రీ.. అప్పుడేం జరిగిందంటే..

PM Modi Convoy: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మెదాబాద్ లో రోడ్ షో లో పాల్గొన్న సంగతి తెలిసిందే. రోడ్ షోలో పాల్గొన్నది ప్రధాని మోదీ కావడంతో ప్రధాని భద్రతా బలగాలతో పాటు స్థానిక గుజరాత్ పోలీసులు భారీ బందోబస్తు చేప్టటారు. అహ్మెదాబాద్ - గాంధీనగర్ రోడ్డు మార్గంలో ప్రధాని పబ్లిక్ ర్యాలీ ముగించుకుని గాంధీనగర్ లోని రాజ్ భవన్ కి తిరిగి బయల్దేరారు. రోడ్ షో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని కాన్వాయ్ వెనకాలే భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఇంకొన్ని వాహనాలు ప్రధాని మోదీ ఉన్న వాహనాన్ని ఆ వెనుకాలే అనుసరిస్తున్నాయి. 

అహ్మెదాబాద్‌లోని దూరదర్శన్ సెంటర్ వద్ద ప్రదాని మోదీ కాన్వాయ్ ఉండగా.. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తున్న మార్గంలోనే ఓ అంబులెన్స్ కుయ్ కుయ్ అంటూ అటువైపుగా దూసుకొచ్చింది. తమ వెనుకాలే అంబులెన్స్ రావడం గమనించిన ప్రధాని నరేంద్ర మోదీ.. వెంటనే ఆ అంబులెన్స్‌కి దారి ఇవ్వాల్సిందిగా తన భద్రతా సిబ్బందికి సూచించారు. ప్రధాని మోదీ ఆదేశాలతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ప్రధాని వాహనం సహా కాన్వాయ్‌లోని మిగతా వాహనాలను రోడ్డుకి ఎడమవైపునకు తీసుకుని నిలిపేస్తూ అంబులెన్స్‌కి  ఏ మాత్రం ఆలస్యం లేకుండా ముందుకు వెళ్లిపోయేలా దారి ఇచ్చారు.  

 

ఈ దృశ్యాన్ని గుజరాత్ బీజేపి విభాగంతో పాటు ( Gujarat Election 2022 ) ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ట్విటర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అంబులెన్స్‌కి దారి ఇవ్వడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 30న సైతం అహ్మెదాబాద్ నుంచి గాంధీనగర్ వెళ్లే క్రమంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Also Read : BSF Jawan entered Pak: అనుకోకుండా బార్డర్ దాటిన జవాన్.. పాకిస్థాన్ ఏం చేసిందంటే..

Also Read : Asaduddin Owaisi: నిందితులను వదిలేయడమే గుణపాఠమా ? అమిత్ షా వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఒవైసి కౌంటర్

Also Read : Gujarat Election: 20 లక్షల ఉద్యోగాలు.. బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటీలు.. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ హామీల వర్షం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News