రాహుల్ ను ఔరంగజేబుతో పోల్చిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి నామినేషన్ వేసిన సందర్భంగా వ్యంగాస్త్రాలు సంధించారు.

Last Updated : Dec 5, 2017, 12:46 PM IST
రాహుల్ ను ఔరంగజేబుతో పోల్చిన ప్రధాని మోదీ

ధర్మ్ పూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి నామినేషన్ వేసిన సందర్భంగా వ్యంగాస్త్రాలు సంధించారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రచార కార్యాక్రమంలో భాగంగా ధర్మ్ పూర్ లో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. ఆ సభలో "ఔరంగజేబు పాలనను కొనసాగిస్తున్న కాంగ్రెస్ కు శుభాకాంక్షలు" అన్నారు. అంటే మోదీ గారు రాహుల్ ను ఔరంగజేబుతో పోల్చారు.

కాంగ్రెస్ పార్టీ ఔరంగజేబు పాలనను కొనసాగిస్తున్నదని.. ఆది పార్టీ కాదు ఒక వంశమని అన్నారు. మాకు 125 కోట్ల మంది భారతీయులు ముఖ్యమని.. వారే మాకు హైకమాండ్ అని.. ఔరంజజేబు పాలన మాకు వద్దని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన మణిశంకర్ మాటలను గుర్తుచేశారు. కాంగ్రెస్ వాళ్లే తమది పార్టీ కాదు.. వంశమని ఒప్పుకున్నారన్నారు.

అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ రాహుల్ ఎన్నికలను చరిత్ర అంశంతో ముడిపెట్టుతూ- 'షాజహాన్ కాలంలో జహంగీర్ వచ్చినప్పుడు ఎన్నికలు జరిగాయి. ఆతరువాత ఔరంగజేబు వచ్చినప్పుడూ ఎన్నికలు జరిగాయి. రాజు కొడుకే సింహాసం అధిష్టిస్తారని  తెలిసి వీటిని నిర్వహించారు" అని  అన్నారు.

రాహుల్ సోమవారం ఉదయం 11 గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేశారు. తుది గడువు మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. రాహుల్ తప్ప మిగితావారెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. తద్వారా ఆయనే కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా లాంఛనంగా ఎన్నికయ్యారు. అయితే ఆయనే పార్టీ చీఫ్ అని ఈరోజు ప్రకటించకపోవొచ్చని తెలుస్తుంది. రేపో, మాపో ప్రకటించవచ్చని సమాచారం.

Trending News