PM Kisan Samman Nidhi Yojana: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు ఆ రోజే ఖాతాల్లోకి..

PM Kisan Samman Nidhi 16th Installment Release Date: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడత నిధుల విడుదలపై క్లారిటీ వచ్చేసింది. ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Feb 22, 2024, 04:40 PM IST
PM Kisan Samman Nidhi Yojana: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు ఆ రోజే ఖాతాల్లోకి..

PM Kisan Samman Nidhi 16th Installment Release Date: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. హోలీ సందర్భంగా రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది. 16వ విడత నిధుల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 28న అకౌంట్‌లలో జమ చేయనున్నట్లు పీఎం కిసాన్ అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో వెల్లడించింది. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి ప్రధాని మోదీ నిధులు విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ స్కీమ్ కింద లబ్ధిదారులకు ఏడాదికి రూ.6 వేలు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఏడాదికి మూడు వాయిదాల్లో రూ.2 వేల చొప్పున అకౌంట్‌లలో వేస్తోంది. ఇప్పటివరకు మొత్తం 15 విడతలుగా కేంద్రం డబ్బులు అందజేసింది. చివరగా గతేడాది నవంబర్ 23న లబ్ధిదారుల ఖాతాలకు రూ.2 వేలు బదిలీ చేశారు. 8 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు రూ.18 వేల కోట్లు జమ చేసింది కేంద్ర ప్రభుత్వం.

Also Read: Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకే కాదు ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు కూడా పెంపు, ఎంతంటే

లబ్ధిదారుల స్టాటస్ ఇలా చెక్ చేసుకోండి.

==> ముందుగా పీఎం కిసాన్ నిధి pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
==> అనంతరం హోమ్‌పేజీలో 'ఫార్మర్ కార్నర్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> 'బెనిఫిషియరీ స్టేటస్'పై క్లిక్ చేయండి.
==> డ్రాప్-డౌన్ మెనుకి వెళ్లి రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, గ్రామాన్ని ఎంచుకోండి.
==> స్టాటస్ చెక్ చేసుకోవడానికి 'గెట్ రిపోర్ట్'పై క్లిక్ చేయండి.
==> లిస్టులో మీరు పేరు ఉందో లేదో చూసుకోండి.

ఈ స్కీమ్‌కు సంబంధించిన ఏమైనా సందేహాలు, సమస్యలు ఉన్నా.. pmkisan-ict@gov.in కు ఈ-మెయిల్ చేయవచ్చు. లేదా 155261, 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 నంబర్లలో కూడా సంప్రదించవచ్చు. పీఎం కిసాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ (కిసాన్ ఈ-మిత్ర) ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. రైతుల ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో మోదీ సర్కారు ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఇటీవల పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం కిసాన్ స్కీమ్ గురించి మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని.. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. పీఎం కిసాన్ యోజన కింద 11.8 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసినట్లు వెల్లడించారు. 

Also Read: Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్‌, ధర పరంగా ఇదే బెస్ట్‌!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News