Petrol Price In Delhi: ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. పెట్రోల్ పై రూ.8 తగ్గింపు!

Petrol Price In Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పెట్రోల్ పై మరోసారి వ్యాట్ తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లీటరు పెట్రోల్ పై రూ.8 తగ్గించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2021, 02:02 PM IST
    • పెట్రోల్ ధరపై ఢిల్లీ గవర్నమెంట్ సంచలన నిర్ణయం
    • లీటరు పెట్రోల్ పై రూ.8 వ్యాట్ తగ్గించే అవకాశం
    • నేటి అర్థరాత్రి నుంచి వ్యాట్ తగ్గింపు అమలు!
Petrol Price In Delhi: ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. పెట్రోల్ పై రూ.8 తగ్గింపు!

Petrol Price In Delhi: పెట్రోల్ ధరపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ను 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ సర్కారు వర్గాలు చెబుతున్నాయి. నేడు (బుధవారం) జరగనున్న ఢిల్లీ మంత్రివర్గ సమావేశంలో సీఎం కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

పెట్రోల్ పై ఈ వ్యాట్ తగ్గింపు కారణంగా రూ.8 తగ్గే అవకాశం ఉంది. ఈ తగ్గింపు నేటి అర్థరాత్రి నుంచి అమలు అవ్వొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నారు. ఈ ఏడాది దీపావళి రోజున పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. లీటరు పెట్రోల్ పై రూ.10.. లీటరు డీజిల్ పై రూ.5 కోత విధించింది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు.. వ్యాట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

Also Read: Omicron: మహారాష్ట్రకు ఒమిక్రాన్ టెన్షన్-రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్

Also Read: Karnataka High Court: కేసు విచారణ జరుగుతుండగా-లైవ్‌లోనే స్నానం చేసిన వ్యక్తి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News