ప్రధాని మోదీ రేపు విద్యార్థులతో "పరీక్షా పే చర్చ" 2020

రానున్న పరీక్షల్లో ఎలాంటి ఒత్తిడులకు విద్యార్థులు గురి కాకుండా ఉండేందుకు వారితో విలువైన అభిప్రాయాలపై చర్చించడానికి ప్రధాని మోదీ సోమవారం "పరీక్ష పపే చర్చా" 2020 కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఢిల్లీలోని టల్కటోరా ఇండోర్ స్టేడియంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. 

Last Updated : Jan 19, 2020, 10:12 PM IST
ప్రధాని మోదీ రేపు విద్యార్థులతో "పరీక్షా పే చర్చ" 2020

న్యూ ఢిల్లీ : రానున్న పరీక్షల్లో ఎలాంటి ఒత్తిడులకు విద్యార్థులు గురి కాకుండా ఉండేందుకు వారితో విలువైన అభిప్రాయాలపై చర్చించడానికి ప్రధాని మోదీ సోమవారం "పరీక్ష పపే చర్చా" 2020 కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఢిల్లీలోని టల్కటోరా ఇండోర్ స్టేడియంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిపి మొత్తం 2000 మంది పాల్గొంటారు. వీరిలో వ్యాస రచన పోటీ ద్వారా 1050 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.

పరీక్షా పే చార్చా అనే కార్యక్రమంలో ప్రధానితో విద్యార్థుల సంభాషణ, వివిధ అంశాలపై చర్చ గత మూడు సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ కార్యక్రమం మొదట్లో జనవరి 16 న జరగాల్సి ఉంది, అయితే పొంగల్, మకర సంక్రాంతి, లోహ్రీ, ఓనం వంటి దేశవ్యాప్త ఉత్సవాల కారణంగా జనవరి 20కి వాయిదా పడింది.

ఈ సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా కలవడానికి వారి ప్రశ్నలను అడగడానికి విద్యార్థులను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన పోటీని నిర్వహించింది. ఈ పోటీ 9 నుండి 12 తరగతుల విద్యార్థులకు మాత్రమే ఉంటుందని మావవనరుల మంత్రిత్వ శాఖా తెలిపింది

ఐఐటి ఖరగ్‌పూర్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్, ఎన్‌ఐఓఎస్ వంటి అత్యున్నతస్థాయి గల సంస్థలు ఈ కార్యక్రమం గురించి ట్వీట్ చేయగా, దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు ఈ కార్యక్రమం గురించి పెద్ద ఎత్తున స్పందించాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News