Padma Vibhushan: కలిసి మురిసిన పద్మ విభూషణాలు.. వెంకయ్య నాయుడు, చిరులకు కేంద్రం పద్మ అవార్డుల వెనక మర్మం ఇదేనా.. ?

Padma Vibhushan Awards: కేంద్ర ప్రభుత్వం ప్రతి యేడాది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ పద్మ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2024 గాను తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులైన వెంకయ్య నాయుడిగారికి,చిరంజీవికి ఒకేసారి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు.. మాజీ ఉప రాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతకరించుకుంది. వీరిద్దరికి ఒకేసారి అవార్డులు ఇవ్వడం వెనక రాజకీయ ప్రాధాన్యత ఉందా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 28, 2024, 12:03 PM IST
Padma Vibhushan: కలిసి మురిసిన పద్మ విభూషణాలు.. వెంకయ్య నాయుడు, చిరులకు కేంద్రం పద్మ అవార్డుల వెనక మర్మం ఇదేనా.. ?

Padma Vibhushan Awards: తెలుగు రాష్ట్రాల్లో ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మవిభూషణ్‌ లభించటం చాలా అరుదుగా జరగుతూ ఉంటుంది. వారిద్దరు స్నేహితులు కావటం.. సమాజాభివృద్ధి కోసం పనిచేసినవారు కావటం ఇంకా రేర్ కేస్. అలాంటి సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పద్మవిభూషణ్‌ పురస్కార గ్రహీతలు మాజీ ఉప రాష్ట్రపతి  వెంకయ్యనాయుడు, మెగాస్టార్‌ చిరంజీవిలు రిపబ్లిక్ డే రోజున కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీళ్లిద్దరు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులైన వెంకయ్య నాయుడుగారికీ, చిరంజీవికి ఒకేసారి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వడం వెనక రాజకీయ  కారణాలే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ యేడాది ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తులో ఉంది. అది కాకుండా ఏపీలో కాపు సామాజిక వర్గంతో పాటు జనసేనానిని ఆకట్టుకునే పనిలో భాగంగా చిరుకు ఈ అవార్డు దక్కిందనే వార్తలు వస్తున్నాయి. చిరు కంటే గొప్పవాళ్లు సినిమా రంగంలో ఉన్న వాళ్లను కాదని ఈయనకే ఈ అవార్డు రావడం వెనక పెద్ద తతంగమే నడించిందనే వార్తలు వస్తున్నాయి.  తెలుగులో సినీ రంగం నుంచి అక్కినేని నాగేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తర్వాత ఈ అవార్డు అందుకున్న మూడో వ్యక్తి చిరు కావడం గమనార్హం. అటు హీరోల్లో రెండో వ్యక్తి కావడం మరో విశేషం. ఇప్పటికే చిరు ఫ్యామిలీకి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. 2022లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించింది. అటు G 20 సమ్మిట్ నుంచి కు మన దేశం తరుపున రామ్ చరణ్‌కు మాత్రమే ఆహ్వానం అందింది. తాజాగా జరిగిన అయోధ్య భవ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి ఫ్యామిలీకి  ప్రత్యేక ఆహ్వానం అందడం వెనక కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాత్ర ఉందనే చెప్పాలి. మొత్తంగా చిరుతో కాపులను ఆకట్టుకునే పనిలో పడిందనే వార్తలు వస్తున్నాయి.

అటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కూడా ఈ అవార్డు రావడం వెనక కూడా కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే పనిలో భాగంగా జరిగిందనే వార్తలు వస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. వెంకయ్య నాయుడు తన జీవితాన్ని ఆర్ఎస్ఎస్‌తో ప్రారంభించి జీవితాంతం నమ్మిక సిద్దాంతం కోసమే పనిచేసారు. ఒక రకంగా బీజేపీ పార్టీకి దక్షిణాదిలో పెద్ద దిక్కుగా నిలిచారు. అయితే.. గత రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్య నాయుడు కాదని ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసారు. దీనిపై ఆయన అభిమానుల్లో ఒకింత నిరాశ ఆవహించింది. ఏది ఏమైనా సరైన సమయంలో సరైన వ్యక్తికి దక్కిన గౌరవంగా ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రజలు భావిస్తున్నారు. ఏది ఏమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ అవార్డుల ఇచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..

ఇదీ చదవండి:  ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News