అయోధ్య అంశంపై అసదుద్దీన్ రియాక్షన్

బీజేపీ పార్టీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే అయోధ్య అంశాన్ని హైలెట్ చేస్తోందని ఎంఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.

Last Updated : Dec 6, 2017, 12:11 PM IST
అయోధ్య అంశంపై అసదుద్దీన్ రియాక్షన్

బీజేపీ పార్టీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే అయోధ్య అంశాన్ని హైలెట్ చేస్తోందని ఎంఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.

కపిల్ సిబాల్ సున్ని వక్ఫ్ బోర్డ్ తరుపున వాదనలు వినిపించారు. క్లయింట్ ను దృష్టిలో ఉంచుకొని ఏ న్యాయవాదైనా కోర్టులో వాదిస్తాడనేది గుర్తుపెట్టుకోవాలి.  బీజేపీ జీఎస్టీ, నోట్ల రద్దు, ఉద్యోగాల కల్పన, ఆర్థిక సంక్షోభం, తీవ్రవాదం మొదలైన సమస్యల వైఫల్యాలను కవర్ చేసుకోవడానికి ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారని ఆరోపించారు.

అహ్మదాబాద్ లో అమిత్ షా, ఒక వైపేమో రాహుల్ గుజరాత్ లో ఆలయాల్ని దర్శిస్తున్నాడు.. మరోవైపు ఆయన పార్టీ నేత కపిల్ సిబాల్ ఏమో రామ జన్మభూమి కేసును ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పడంపై ఒవైసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చూస్తుంటే 'బాబ్రీ మసీదు-రామజన్మభూమి' అంశంపై కావాలనే బీజేపీ, ఆరెస్సెస్, వి హెచ్ పి లు పబ్బంగడుపుకోవాలని చూస్తున్నాయన్నారు. అక్టోబర్ 2018లోనే రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి చెప్పిన విషయాలను ఈ సందర్భంగా ఒవైసి గుర్తుచేశారు.

Trending News