Covid 19: 400 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా.. బడ్జెట్ సమావేశాలకు ముందు కలకలం...

Parliament staff test covid 19 positive: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కరోనా అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా 400 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా సోకడం తీవ్ర కలకలం రేపుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 02:21 PM IST
  • 400 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా
  • ఇటీవలి టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధారణ
  • ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న సిబ్బంది
  • పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు కలకలం రేపుతున్న కరోనా
Covid 19: 400 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా.. బడ్జెట్ సమావేశాలకు ముందు కలకలం...

Parliament staff test covid 19 positive: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కరోనా అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా 400 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బందికి కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. జనవరి 4 నుంచి 8 మధ్య 1409 మంది పార్లమెంట్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా ఇందులో 400 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ 400 మంది శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించినట్లు అధికారులు వెల్లడించారు.

కరోనా బారినపడిన ఆ 400 మంది ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరిలో 200 మంది లోక్‌సభ సిబ్బంది, 69 మంది రాజ్యసభ సిబ్బంది కాగా.. మిగతా 133 మంది అనుబంధ సిబ్బంది ఉన్నారు. ఫిబ్రవరి 1 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. ఇంతలోనే పెద్ద సంఖ్యలో పార్లమెంట్ సిబ్బంది కరోనా బారినపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. వీరికి సోకింది పాత వేరియంటా.. లేక కొత్తగా వ్యాప్తి చెందుతోన్న ఒమిక్రాన్ వేరియంటా అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. 

ప్రస్తుతం ఢిల్లీలో 48,178 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నగరంలో కరోనా పాజిటివిటీ రేటు 19.60 శాతానికి పెరిగింది. రాబోయే 24 గంటల్లో మరో 22వేల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా పీక్ స్టేజీలో ఢిల్లీలో రోజుకు 70 వేల కేసుల వరకు నమోదవొచ్చునని చెబుతున్నారు. ఇప్పటికే పలు అంచనాలు, అధ్యయనాలు భారత్‌లో వచ్చే ఫిబ్రవరిలో కరోనా పీక్ స్టేజీకి (Covid 19 Third Wave in India) చేరుకుంటుందని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కరోనా అడ్డంకిగా మారుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Family Suicide in Vijayawada: ఆ కుటుంబం ఆత్మహత్యకు కారణమదేనా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News