కేంద్రం, రైల్వే శాఖలో భారీగా ఉద్యోగులను తొలగించనుందట. సుదీర్ఘకాలం పాటు అనధికారికంగా సెలవులో ఉన్న ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది రైల్వేశాఖ. వారిలో ఎక్కువ మంది గ్రూప్-సీ, గ్రూప్-డీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆదేశాల మేరకు ఇప్పటివరకు అలా సెలవులో ఉన్న 13,500 మంది ఉద్యోగులను గుర్తించింది. వారిని త్వరలోనే విధుల నుంచి తొలగించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
రైల్వే పనితీరులో పారదర్శకతను పెంచేందుకు ఇటీవల రైల్వేశాఖ ఓ డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలోనే దీర్ఘకాలంగా సెలవులో ఉంటున్న సిబ్బంది వివరాలను సేకరించింది. ‘మొత్తం 13 లక్షల మంది ఉద్యోగుల్లో 13వేల మంది దీర్ఘకాలంగా అనధికారికంగా సెలవులో ఉంటున్నట్లు గుర్తించాం. వారిపై క్రమశిక్షణ చర్యలను ప్రారంభించాం. అలాంటి ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని భావిస్తున్నాం’ అని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటన వెలువరించిన వెంటనే రైల్వే శాఖ ఆ మేరకు చర్యలను ప్రారంభించింది. ఉద్యోగుల జాబితా నుంచి వీరి పేర్లను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారని సమాచారం.
Indian #Railways initiates disciplinary action against over 13,500 employees of Group C & D, who have been on long/unauthorised leaves.
— ANI (@ANI) February 10, 2018