Old Pension Scheme Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. పెన్షన్ స్కీమ్‌ మార్చుకోవాలనుకునే వారికి ఆ రోజే లాస్ట్

OPS Latest Update: ఉద్యోగుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. పాత పెన్షన్ విధానాన్ని ఎంచుకునేందుకు చివరి అవకాశం ఇచ్చింది. అయితే ఈ ఆప్షన్ అందరికీ అందుబాటులో ఉండదు. ఎవరు అర్హులంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2023, 12:15 PM IST
Old Pension Scheme Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. పెన్షన్ స్కీమ్‌ మార్చుకోవాలనుకునే వారికి ఆ రోజే లాస్ట్

OPS Scheme Latest Update: పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)పై కేంద్రం ప్రభుత్వం లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. అనేక డిమాండ్ల తరువాత ఇటీవలె ఓపీఎస్ ఆప్షన్ ఎంచుకోవడానికి ఉద్యోగులకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. 2003 డిసెంబర్ 22వ తేదీలోపు ప్రకటనలు లేదా నోటిఫై చేసిన పోస్టుల కోసం సెంట్రల్ సర్వీసెస్‌లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్ ఎంచుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అయితే 2003 డిసెంబర్ 22వ తరువాత ఉద్యోగాల్లో చేరిన వారికి కొత్త పెన్షన్ విధానమే వర్తించనుంది.    

పాత పెన్షన్ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే.. అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆగస్టు 31వ తేదీలోపు కొత్త ఆప్షన్ ఎంచుకోవాలి. లేకపోతే వారికి ఆటోమేటిక్‌గా కొత్త పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. ఆగస్టు 31లోపు ఎంపిక చేసుకున్న ఆప్షన్ ఫైనల్‌ కానుంది. ఆ తరువాత మళ్లీ మార్చుకోవాలన్నా అవకాశం ఉండదు. గడువు ముగిసిన తరువాత పెన్షన్ స్కీమ్‌ను మార్చుకునే అవకాశం ఉండదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.  

పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఓపీఎస్‌ను పునరుద్దరిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమకు కూడా పాత పెన్షన్ విధానమే కావాలంటూ డిమాండ్స్ చేశారు. ఇన్నాళ్లు ఈ విషయంపై మౌనంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇటీవలె అడుగు ముందుకు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2003 డిసెంబర్ 22వ తేదీలోపు చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ఎంచుకునేందుకు ఒక అవకాశం ఇచ్చింది. ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే మళ్లీ మార్చుకునే అవకాశమే ఉండదు. 2004లో ఉద్యోగాల్లో చేరిన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ సిబ్బంది, ఇతర కేంద్ర ఉద్యోగులకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. అప్పట్లో పరిపాలనా కారణాల రీత్యా వీరి నియామక ప్రక్రియలో జాప్యం జరిగింది. 

కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్‌పై తీసుకున్న ఈ నిర్ణయంతో ఖజనాపై మరింత భారం పడనుంది. ఉద్యోగి పదవీ విరమణకు ముందు తీసుకున్న చివరి జీతం ఆధారంగా పాత పెన్షన్ విధానం అమలవుతుంది. ఇది ద్రవ్యోల్బణం రేటు పెరగడంతో డీఏ పెంపుతో కూడా పెరుగుతుంది. ప్రభుత్వం కొత్త పే కమిషన్‌ను అమలు చేసినా.. పెన్షన్‌ పెరుగుతుంది.

Also Read: 7th Pay Commission: రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మార్చిలోనే పెరిగిన జీతం

Also Read: Jammu Kashmir Crime: మరో దారుణ ఘటన.. మహిళను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికిన నిందితుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News