న్యూఢిల్లీ: యూజీసీ నెట్ 2020 (UGC NET-2020) ఏడాదికిగానూ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైనవారు యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే చాలు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేయడానికి క్లిక్ చేయండి
అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం UGC NET-2020 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవల విడుదల చేసింది. మార్చి 16న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 16వరకు కొనసాగుతోంది. ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ ఏప్రిల్ 17. తగిన అర్హతలున్న విద్యార్థులు, అభ్యర్థులు ఏప్రిల్ 16వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
యూజీసీ నెట్ వెబ్సైట్ కోసం క్లిక్ చేయండి
నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఫీజు: దరఖాస్తు ఫీజు విషయానికొస్తే జనరల్ అభ్యర్థులు రూ.1000, ఓబీసీ, EWS అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.
UGC NET-2020 Notification ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16.03.2020.
దరఖాస్తుకు చివరితేది: 16.04.2020
ఫీజు చివరితేది: 17.04.2020
సవరణకు అవకాశం: ఏప్రిల్ 18 నుంచి 24వ తేదీ వరకు
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: 15.05.2020
UGC NET-2020 ఎగ్జామ్ తేదీలు: జూన్ 15 – 20 వరకు.
ఫలితాల వెల్లడి: 05.07.2020
దరఖాస్తు చేయడానికి క్లిక్ చేయండి