Corona second wave: కరోనా సెకండ్ వేవ్. దేశవ్యాప్తంగా గజగజలాడిస్తోంది. తగ్గినట్టే తగ్గి..చుట్టేస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులతో ఆందోళన పెరుగుతోంది. శ్మశానంలో స్థలం లేక..మార్చురీలో అవకాశం లేక మృత్యుఘోషతో ఘోర పరిస్థితులు తలెత్తుతున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్(Corona second wave)విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. మరోసారి బెడ్స్ కొరత ఏర్పడుతోంది. చాలా రాష్ట్రాల్లో పరిస్థితి ఘోరంగా మారిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలు చేసేందుకు శ్మశానాలు లభ్యం కావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు. రాయ్‌పూర్( Raipur Hospital)లో అతిపెద్ద ఆసుపత్రిలో నిండా మృతదేహాలే దర్శనమిస్తున్నాయి.ఎటు చూసినా కరోనా మృతులతో పరిస్థతి ఘోరంగా కన్పిస్తోంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆసుపత్రిలో మృతదేహాల్ని భద్రపరిచేందుకు ఖాళీనే లేదు. ఎక్కడైనా అవకాశముందా అని ఆసుపత్రి సిబ్బంది నిరీక్షణ ఎక్కువైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా కారణంగా మరణిస్తున్న వారి మృతదేహాలు మార్చురీ ( Mortuary) వద్ద భారీగా పేరుకుపోతున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా ఐసీయూ ఆక్సిజన్ నిండిపోయిందని తెలుస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు మరణిస్తారని ఎవరు ఊహించారని..సాధారణంగా చనిపోయినవారి మృతదేహాల్ని భద్రపరిచే స్థలం మాత్రమే ఉందని రోజుకు 10-20 మంది చనిపోతే ఎలా భద్రపర్చగలమని ఆసుపత్రి ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ మీరా బఘేల్ అంటున్నారు. 10-20 మృతదేహాల కోసం ఏర్పాట్లు చేస్తుంటే...50-60 మంది చనిపోతున్నారని అన్నారు.
Also read: Sputnik V Vaccine: అత్యవసర వినియోగానికి స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్‌కు డీసీజీఐ ఆమోదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook