ఈ మూడింటికీ 'ఆధార్' అవసరం లేదు: యూఐడీఏఐ స్పష్టీకరణ

ప్రతి దానికీ ఆధార్ తప్పనిసరి చేస్తూ కేంద్రం, రాష్ట్రాలు ప్రజలకు అనధికార ఆదేశాలను జారీచేసిన విషయం తెలిసిందే..!

Last Updated : Feb 12, 2018, 07:30 PM IST
ఈ మూడింటికీ 'ఆధార్' అవసరం లేదు: యూఐడీఏఐ స్పష్టీకరణ

ప్రతి దానికీ ఆధార్ తప్పనిసరి చేస్తూ కేంద్రం, రాష్ట్రాలు ప్రజలకు అనధికార ఆదేశాలను జారీచేసిన విషయం తెలిసిందే..! ప్రతి అంశానికీ ఆధార్ ను అనుసంధానం చేసుకోవాల్సిందే అని ప్రభుత్వాలు, సంస్థలు ఒత్తిడిచేస్తున్నాయి. అయితే తాజాగా.. ఈ అనుసంధానాలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పందించింది.

ఆధార్ ను అనుసంధానం చేయలేదనే కారణంతో ప్రజలకు అందించే ఏ లబ్దీ తిరస్కరించడానికి వీళ్లేదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. అత్యవసర వైద్యం, స్కూళ్లలో ప్రవేశాలు, రేషన్ పంపిణీకి సంబంధించి ఆధార్ కార్డు లేకపోయినా తిరస్కరించవద్దని చెప్పింది. ఇందుకోసం లబ్దిదారుల గుర్తింపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు, పరిపాలన విభాగాలకు లేఖలు రాసింది.   

Trending News