నేషనల్ ఎలిజిబులిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2019 పరీక్షకు నేటి నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) తెలిపింది. గతంలో సీబీఎస్ఈ నిర్వహించిన ఈ ఎంట్రన్స్ టెస్టును ఈ ఏడాది ఎన్టీఏ నిర్వహించనుంది. ఎంబీబీఎస్/బీడీఎస్ వంటి మెడికల్ కోర్సులలో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు రాసే ఈ ఎంట్రన్స్ టెస్ట్ కోసం తమ పేరు నమోదు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ ntaneet.nic.in లోకి లాగిన్ అయి తమ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. 2018లో 13 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కాగా ఈ ఏడాది కూడా ఇంచుమించు అదే సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది లాగే పెన్ను, పేపర్ పద్దతిలోనే పరీక్ష నిర్వహణ ఉంటుందని ఎన్టీఏ తెలిపింది.
ముఖ్యమైన తేదీలు:
నవంబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు నీట్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుంది.
ఏప్రిల్ 15, 2019 నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మే 6న రాత పరీక్ష నిర్వహణ
నీట్ 2019 రిజిస్ట్రేషన్‌కి అవసరమైన డాక్యుమెంట్స్:
10వ తరగతి మార్క్స్ మెమొ
12వ తరగతి మార్క్స్ మెమొ
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్కాన్ కాపీ
స్కాన్ చేసిన సంతకం
ఆధార్ లేక ఓటర్ వంటి వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్