Ncw visits rg kar hospital inquiry on Kolkata doctor rape and murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ విచారణ జరుపుతుంది. మరోవైపు ఈ ఘటనను ఇప్పటికే జాతీయ మహిళ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. దీనిపై విచారణకు ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా.. ఆర్ జీ కర్ ఆస్పత్రిలో రాత్రి పూట విధుల్లో ఉన్నన 31 ఏళ్లట్రైయినీ డాక్టర్ పై దారుణంగా అత్యాచారం చేసి, ఆపై హతమార్చారు. ఈ ఘటన తెల్లవారు జామున జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు తొలుత ఈ ఘటనను సూసైడ్ గా భావించారు.
కానీ యువతి శరీరంపై దాడులు, పోస్టు మార్టం రిపోర్టులో ఆమెపై సాముహిక అత్యాచారం జరిగిందని విషయం బైటపడింది.ఈ నేపథ్యంలో , జాతీయ మహిళ కమిషన్ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి ఇద్దరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో NCW సభ్యురాలు డెలినా ఖోండ్‌గుప్ , పశ్చిమ బెంగాల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి న్యాయవాది సోమా చౌదరి ఉన్నారు. ఈ కమిటీ ఆగస్టు 12న కోల్‌కతాకు చేరుకుంది. అప్పటి నుండి ట్రైనీ డాక్టర్ మరణానికి సంబంధించిన పరిస్థితులను దగ్గర నుంచి పరిశీలిస్తోంది.
తాజాగా, జాతీయ మహిళ కమిషన్ సంచలన విషయాలు..
ముఖ్యంగా ఆర్జీకర్ ఆస్పత్రిలో.. సంఘటన జరిగిన సమయంలో సెక్యురిటీ గార్డులు లేరని, రాత్రి షిఫ్ట్‌లలో ఆన్-కాల్ ఇంటర్న్‌లు, వైద్యులు, నర్సులకు తగిన రక్షణ లేకుండా పోయిందని వెల్లడించింది. అదే విధంగా క్రైమ్ జరిగిన తర్వాత.. ఆ ప్రదేశంలో ఇతరులు వెళ్లకుండా పోలీసులు సీల్ చేయలేదని తెల్చి చెప్పింది. అంతేకాకుండా.. ఘటన జరిగిన ప్రదేశంలో వస్తువులు, ఆ ప్రదేశంలో కొన్ని మార్పులు కూడా చేసినట్లు గుర్తించింది. దీని వల్ల ఎవిడెన్స్ లు పూర్తిగా తారుమారుచేసేలా అక్కడి పరిస్థితులు కన్పించాయని కూడా జాతీయ మహిళ కమిషన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆసుపత్రిలో మహిళా వైద్య సిబ్బందికి కనీస సౌకర్యాలు లేవని చెప్పింది. వాష్ రూమ్ లు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని, లైటింగ్ లు, భద్రత కూడా సరైన విధంగా లేదని కూడా ఎన్సీడబ్ల్యూ చెప్పింది. ఘటనపై.. విచారణకు సంబంధించి ఎన్సీడబ్ల్యూ తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేసింది. అదే విధంగా.. ఈ సంఘటన తర్వాత రాజీనామా చేసిన మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను ప్రశ్నించలేదని కూడా ఎన్సీడబ్ల్యూ చెప్పింది.
మరోవైపు.. ఆగస్ట్ 10న,జాతీయ మహిళ కమిషన్ కోల్‌కతాలోని పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది. ఈ సంఘటనపై తక్షణమే చర్య తీసుకోవాలని, సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా.. దేశంలో ప్రస్తుతం జూనియర్ డాక్టర్ హత్యాచారంకు నిరసనగా.. 24 గంటల పాటు ఐఎంఏ కూడా సమ్మెకు పిలుపునిచ్చింది. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప దేశంలోని అన్నిరకాలు సేవలు మాత్రం ప్రస్తుతానికి నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి