రాఖీ ( Raakhi )..అన్నాచెల్లెల్ల బంధానికి ప్రతీక. ఇరువురి మధ్య ఉండే ప్రేమానురాగాలకు, నేనున్నానంటూ భరోసా ఇచ్చే క్రమంలో భాగంగా కట్టుకునేది రాఖీ. అందుకే మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ నిందితుడికి వినూత్నపద్ధతిలో ఆదేశాలు జారీ చేసింది. రాఖీ కట్టించుకుంటేనే బెయిల్ అంటూ మెలిక పెట్టింది. అదేంటో చూద్దామా..
బెయిల్ కోసం పిటీషన్ పెట్టుకున్న ఓ నిందితుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు ( Madhya pradesh High court ) వినూత్నపద్ధతిలో పెట్టిన కండీషన్లు ఆశ్చర్యం కల్గిస్తున్నాయి. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడు బెయిల్ ( Bail ) కోసం పిటీషన్ పెట్టుకున్నారు మధ్యప్రదేశ్ హైకోర్టులో. సాధారణంగా కోర్టులు బెయిల్ ఇవ్వాలంటే కండీషన్లతో ఇస్తుంటాయి. ఇప్పుడు రాఖీ సమయం కదా. కేసుకు తగ్గట్టుగా బాధితుడిలో పరివర్తన తెచ్చేందుకు కోర్టు వినూత్నంగా ప్రయత్నించింది. ఈ నెల 3న అంటే సోమవారం నాడు రాఖీ పురస్కరించుకుని బాధితురాలి ఇంటికి వెళ్లి మరీ...ఆమెతో రాఖీ కట్టింటుకోవాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా కానుకగా సోదరికి 11 వేల రూపాయలు, ఆమె కొడుకుకు మరో 5 వేలు అందించాలని కోరింది. కోవిడ్ గైడ్ లైన్స్ ప్రకారమే అన్నీ పూర్తి చేయాలని సూచించింది. వీటికి సంబందించిన రసీదులు, ఫోటోలు కోర్టుకు సమర్పించాలని..ఇదంతా కేవలం బెయిల్ పొందేందుకు షరతులు మాత్రమేనని స్పష్టం చేసింది. Also read: Ganesh Idols: ఆకట్టుకుంటున్న కరోనా గణపతి విగ్రహాలు
జూన్ నెలలో నిందితుడు పొరుగింట్లో ఉన్న ఓ వివాహిత ఇంట్లో చొరబడి అత్యాచారయత్నం ( Attempt to Rape ) చేశాడు. ఈ కేసులో అరెస్టైన నిందితుడు బెయిల్ కోసం అప్లై చేసుకోగా...కోర్టు రాఖీ షరతులతో బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు భార్యతో సహా ఆమె ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆమెకు అన్నివిధాలుగా రక్షణగా ఉంటానని హామీ ఇవ్వాలని జస్టిస్ రోహిత్ ఆర్య ( Justice Rohit Arya ) సూచించారు. రాఖీ పర్వదినాన మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ రోహిత్ ఆర్య విధించిన షరతులు ఆసక్తిగా మారాయి. ప్రాధాన్యత సంతరించుకున్నాయి. Also read: Train Journey: కోవిడ్ 19 వైరస్ ముప్పు ఎంతవరకు?