మైనర్ బాలికపై నలుగురి గ్యాంగ్ రేప్... ప్రియుడి కళ్ల ముందే అఘాయిత్యం...

Minor girl gang raped: బిహార్‌లోని పాట్నాలో ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌కు గురైంది. బాలిక ప్రియుడితో ఉన్న సమయంలో నలుగురు వ్యక్తులు ఆ జంటను బెదిరింపులకు గురిచేశారు. ఆపై ప్రియుడి కళ్ల ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 03:51 PM IST
  • పాట్నాలో మైనర్ బాలికపై నలుగురి గ్యాంగ్ రేప్
    పోలీసులమని చెప్పి జంటను బెదిరించిన గ్యాంగ్
    ప్రియుడి కళ్ల ముందే బాలికపై అత్యాచారం
మైనర్ బాలికపై నలుగురి గ్యాంగ్ రేప్... ప్రియుడి కళ్ల ముందే అఘాయిత్యం...

Minor girl gang raped: బిహార్‌లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు (Gang Rape) పాల్పడ్డారు. ప్రియుడి కళ్ల ముందే ఆమెపై ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. తాము పోలీసులమని చెప్పి బెదిరింపులకు గురిచేసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత బాలిక పోలీసులతో చెప్పింది. నిజానికి ఈ ఘటన తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వాపోయింది. పాట్నాలో (Patna) ఈ నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే... పాట్నాకు (Patna) చెందిన 13 ఏళ్ల బాలిక గత బుధవారం (నవంబర్ 17) తన ప్రియుడిని కలిసేందుకు వెళ్లింది. ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. భయంతో ఆ జంట (Love couple) అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా... ఆ నలుగురు వారిని అడ్డుకున్నారు. తాము పోలీసులమని చెప్పి సెల్‌ఫోన్‌తో ఇద్దరి ఫోటోలు తీశారు.

అనంతరం ఆ బాలికను నిర్బంధించి ప్రియుడి కళ్లెదుటే గ్యాంగ్ రేప్‌కు (Gang rape) పాల్పడ్డారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత బాలిక ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. జరిగిన ఘటన గురించి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఇల్లు వదిలి పారిపోయింది. ఈ క్రమంలో షాపూర్ సమీపంలో ఓ వ్యక్తి ఆమెను గమనించి ఆశ్రయం కల్పించాడు. ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. ఆపై బాలిక కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు ఈ ఘటనపై సమాచారమిచ్చాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read : దారుణం: మత్తుమందు ఇచ్చి.. మర్మాంగాన్ని కోసేసింది..!

బాలికపై అత్యాచారానికి (Crime against women) పాల్పడిన నలుగురు నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురు నిందితులను కూడా వీలైనంత త్వరగా పట్టుకుంటామని తెలిపారు. ఇప్పటివరకూ ఈ ఘటనపై లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని... అయినప్పటికీ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News