Rare Verdict: మగాళ్లంటే అంతా లోకువా..?.. భర్తకు భరణం చెల్లించాలని అరుదైన తీర్పు వెలువరించిన కోర్టు..అసలేం జరిగిందంటే..?

Madhya Pradesh: పెళ్లి తర్వాత భార్యభర్తలన్నాక కొన్ని సార్లు మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. ఇద్దరు పెరిగిన వాతావరణం, చుట్టుపక్కల పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దీంతో ఏదైన వివాదాలు సంభవిస్తే వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి.  కానీ కొందరు ప్రతిదానికి పోలీసులు, కోర్టుల వరకు వెళ్తుంటారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 23, 2024, 12:42 PM IST
  • - ప్రేమించి పెళ్లిచేసుకుని చుక్కలు చూపించిన భార్య..
    - అమ్మనాన్నలతో మాట్లడొద్దని టార్చర్..
Rare Verdict: మగాళ్లంటే అంతా లోకువా..?.. భర్తకు భరణం చెల్లించాలని అరుదైన తీర్పు వెలువరించిన కోర్టు..అసలేం జరిగిందంటే..?

Woman Should Pay Alimony Of Rupees 5Thousand To Husband: సాధారణంగా చాలా మంది పెళ్లి చేసుకున్నాక, ఏదోక విషయంలో తప్పకుండా గొడవలు పడుతుంటారు. అసలు కలహాలు లేనిదే ఏ కాపురం కూడా ఉండదు. కలహలుపడ్డా.. తర్వాత మాట్లాడుకుని, ఒకరితో మరోకరు వీడిపోకుండా కలిసి ఉండటంలోనే ఆనందం ఉంటుంది. కొందరు భార్యభర్తలు ఎంత గొడవలు పడ్డా, పొట్లడిన తిరిగి కలిసిపోతుంటారు. ఆసమయంలో గొడవలు పడ్డా కూడా ఆ తర్వాత ఒకరిని విడిచి మరోకరు అస్సలు ఉండలేదు. కానీ మరికొందరు జంటలు సైకోలుగా ఉంటారు.

Read More: Summer Foods: వేసవిలో ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు ఒంట్లో వేడి మొత్తం మాయం..

ప్రతిదానికి గొడవలు పడుతుంటారు. కొందరు భార్యలు.. తమకు బంగారం కొనట్లేదని, షాపింగ్ తీసుకెళ్లడంలేదని, సంపాదన సరిగ్గాలేదని గొడవలు పడుతుంటారు. ఇంకొందరు మగ మహారాజులు.. భార్య చీర సరిగ్గా కట్టలేదని, కూరలో ఉప్పు వేయలేదని, చికెన్ సరిగ్గా వండలేదని, కలర్ తక్కువగా ఉందని, కట్నంతేలేదని రకరకాల కారణాలతో గొడవలు పడుతుంటారు.

ఈ క్రమంలో కొందరు గొడవలతో పీక్స్ కు వెళ్లిపోయి.. పోలీసులు, కోర్టుల వరకు వెళ్లిపోతుంటారు. దీంతో ఇద్దరు తమ జీవితాలను ఆ సమయంలో ఏర్పడిన కోపంతో నాశనం చేసుకుంటారు. అందరిలో నవ్వులపాలౌతారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు..

మధ్య ప్రదేశ్ లో ఇండోర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన కోర్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉజ్జయినికి చెందిన అమన్ మరో యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరి ఇళ్లలో తమ మనస్సులోని మాటను చెప్పి, పెద్దలను ఒప్పించారు. ఆ తర్వాత  2021 లో వీరి పెళ్లి వేడుకగా జరిగింది. కొన్నిరోజులు వీరి కాపురంబాగానే సాగింది. భార్య వేరుగా ఉందామనడంతో అతగాడు వేరుగా కాపురం ఉంటున్నారు. భార్య అతడికి ఇంటికి వెళ్లకూడదని, తల్లిదండ్రులతో మాట్లాడవద్దని టార్చర్ చేసింది. ఇంట్లో కూడా అనేక రకాలుగా సూటీపోటీ మాటలతో వేధించేది. 

భార్యపెట్టే టార్చర్ ను భరించలేక, తన అమ్మనాన్నల దగ్గరకు అమన్ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు. దీంతో సదరు యువతి అమన్ పై పోలీసు కేసు పెట్టింది. అత్తింటి వారు. భర్త వేధిస్తున్నారంటూ.. గృహహింస కేసు పెట్టింది. తనకు భరణం వచ్చేలా చూడాలని కూడా కేసు పెట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఫ్యామిలీ కోర్టులో హియరింగ్ వచ్చింది. ఈ క్రమంలో కోర్టు.. ఇద్దరి తరపు లాయర్ల వాదనలు పరిశీలించింది. అమన్ భార్య.. పెట్టిన కేసులకు, చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి పొంతన లేదని జడ్జీ గుర్తించారు.

అంతేకాకుండా అమన్ వేధింపులకు గురిచేసినట్లు కూడ ఎలాంటి ఆధారాలను ఆమె దాఖలు చేయలేదు. ఇంకా మహిళ ఉద్యేష పూర్వకమైన ఆరోపణలు ఎక్కువగా చేస్తుండటంతో కోర్టు సీరియస్ గా పరిగణించింది. అమన్ ను కావాలనే సదరు మహిళ.. అభాసు పాలు చేస్తుందని కోర్టు ఒక క్లారిటీకి వచ్చింది.

Read More: Varsha Bollamma: కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తోన్న వర్ష బొల్లమ్మ, ఫోటోలు వైరల్

ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టు అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళను మందలిస్తూ.. అమన్ వేధింపులకు గురిచేశాడని ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు.  పద్దతి మార్చుకొవాలని కూడా మహిళను హెచ్చరించింది. భర్తను ట్రీట్ చేయాల్సిన విధానం ఇది కాదని కోర్టు చివాట్లు పెట్టింది. అంతే కాకుండా.. మహిళ.. భర్త అమన్ కు ప్రతినెల రూపాయల 5000 భరణం చెల్లించాలని కూడా కోర్టు తీర్పునిచ్చింది.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News