Jabalpur Rape Case: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. తండ్రి స్నేహితులే నిందితులు!

Jabalpur Rape Case: మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో దారుణం జరిగింది. 7వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ దారుణానికి పాల్పడ్డ వారు బాధితురాలి తండ్రి స్నేహితులేనని పోలీసులు స్పష్టం చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2021, 11:46 AM IST
    • మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో దారుణం
    • 11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
    • ఈ ఘటనలో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు
Jabalpur Rape Case: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. తండ్రి స్నేహితులే నిందితులు!

Jabalpur Rape Case: మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఏడో క్లాస్ చదువుతున్న 11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. జబల్ పూర్ పరిసర  గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.  

బాధితురాలి తండ్రి స్నేహితులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు. తండ్రి లేని సమయంలో తన ఇంట్లోని పెరట్లో బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అత్యాచారానికి పాల్పడిన వారిలో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసినట్లు జబల్ పూర్ అడిషనల్ ఎస్పీ సంజయ్ అగర్వాల్ స్పష్టం చేశారు. 

ఏం జరిగిందంటే?

మధ్యప్రదేశ్ జబల్ పూర్ లోని 7వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. తండ్రి లేని సమయంలో ఆయన స్నేహితులు ఇద్దరు ఇంటికి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన వారిద్దరూ.. బాలికను పెరట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. 

అయితే ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ, బాలికపై అత్యాచారం జరుగుతున్న గమనించిన పొరుగింటి వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. 

ఆ తర్వాత బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా డిసెంబరు 11న కేసు నమోదు చేశారు. వారిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితులిద్దరూ 25 ఏళ్ల వారేనని పోలీసులు తెలిపారు. IPC ప్రకారం SC & ST (అట్రాసిటీ నిరోధక చట్టం) తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.   

Also Read: Madhya Pradesh: మధ్యప్రదేశ్​లో దారుణం...నాలుగేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం

ALso Read: 66 ఏళ్ల వృద్దురాలికి మిడిల్ ఫింగర్ చూపించి హేళన-ఆర్నెళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News