Lt General Manoj Pande Appointed New Indian Army Chief: ఇండియన్ ఆర్మీ తదుపరి చీఫ్‌గా ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేని కేంద్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. మనోజ్ పాండే మే 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ చర్చలు జరిపి.. మనోజ్ పాండేను సైన్యాధిపతిగా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ ఎంఎం నవరణె స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టన్నన్నారు. ఇక కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఆర్మీ చీఫ్ కానున్న తొలి వ్యక్తి పాండేనే కావడం విశేషం.
భారత ఆర్మీ చీఫ్ కోసం మనోజ్ పాండేతో పాటు జై సింగ్ నయన్, యోగేంద్ర దిమ్రీ, అమర్దీప్ సింగ్ భిందర్ పేర్లను కేంద్రం పరిశీలించింది. అయితే వీరిలో అత్యంత సీనియర్ అయిన మనోజ్ పాండేకే కేంద్రం ఓటేసింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన పాండే.. డిసెంబర్ 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో నియమితులు అయ్యారు. ఆపరేషన్ పరాక్రమ్, ఆపరేషన్ విజయ్ సమయంలో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
విమాన ప్రమాదంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ఖాళీ అయిన పోస్ట్‌ను ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎంఎం నవరణెతో భర్తీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే నవరణె ఏప్రిల్ చివరి నాటికి రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ కొత్త చీఫ్‌గా ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న మనోజ్ పాండేను నియమించారు. 39 ఏళ్ల ఆర్మీ అనుభవం ఉన్న మనోజ్ పాండే.. మే 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. నవరణె ఈ నెల 30 వరకు బాధ్యతలు కొనసాగిస్తారు.
Also Read: Viral Video: బోట్ నుంచి నీటిలోకి దూకిన పులి.. 'లైఫ్ ఆఫ్ పై'ను గుర్తుకు తెచ్చిన ఘటన
Also Read: Cancel IPL: ఐపీఎల్ 2022ని క్యాన్సిల్ చేయండి.. డిమాండ్ చేస్తున్న ఆ రెండు జట్ల ఫాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook