New CDS: నూతన సీడీఎస్‌గా అనిల్‌ చౌహాన్‌.. బిపిన్‌ రావత్‌ స్థానంలో..

New CDS: భారత తదుపరి సీడీఎస్‌గా అనిల్‌ చౌహాన్‌ను కేంద్రం నియమించింది. జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణానంతరం దాదాపు 9 నెలల తర్వాత ఆయన స్థానంలో అనిల్‌ చౌహాన్‌ను ఎంపిక చేసింది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2022, 08:12 AM IST
New CDS: నూతన సీడీఎస్‌గా అనిల్‌ చౌహాన్‌.. బిపిన్‌ రావత్‌ స్థానంలో..

Lt Gen Anil Chauhan appointed new CDS:  భారత త్రివిధ దళాల నూతన అధిపతి(సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్) నియమితులయ్యారు. తొలి సీడీఎస్ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణానంతరం దాదాపు 9 నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు.. అనిల్‌ చౌహాన్‌ను (Anil Chauhan) ఎంపిక చేసినట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈయన రక్షణశాఖ, మిలిటరీ వ్యవహారాల కార్యదర్శిగానూ వ్యవహారించనున్నారు. 

గత ఏడాది మేలో ఈస్టర్న్‌ ఆర్మీ కమాండర్‌గా చౌహాన్‌ (61) పదవీ విరమణ  చేశారు. ప్రస్తుతం జాతీయ భద్రతామండలి సలహాదారుగా ఉన్నారు. 40 ఏళ్ల సర్వీసులో సైన్యంలో వివిధ రకాల హోదాల్లో పనిచేశారు.  జమ్ముకశ్మీర్​, ఈశాన్య భారత్​లో తీవ్రవాద కార్యకలాపాల్ని నియంత్రించడంలో ఈయనకు విశేష అనుభవం ఉంది. అనిల్ చౌహాన్ ..1961 మే 18న ఉత్తరాఖండ్​లోని ఘర్వాల్​లో జన్మించారు. 

కొన్నేళ్ల కిందట సీడీఎస్ వ్యవస్థను ఎన్​డీఏ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. భారత తొలి త్రిదళాధిపతిగా 2020 జనవరి 1న జనరల్ బిపిన్ రావత్​ బాధ్యతలు చేపట్టారు. అయితే తమిళనాడు కూనుర్ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ సహా 14 మంది దుర్మరణం చెందారు. అప్పటి నుంచి సీడీఎస్ పోస్టు ఖాళీగా ఉంది. 

Also Read: New Attorney General: నూతన అటార్నీ జనరల్‌గా ఆర్​.వెంకటరమణి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News